

కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున పదివేల రూపాయలు పెళ్ళికానుకగా అందజేసిన ఎమ్మెల్యే కాకర్ల..!
ఉదయగిరి : సెప్టెంబర్ 15 (మన ద్యాస న్యూస్):
ఉదయగిరి మండల కేంద్రంలోని సినిమా హాలు వీధిలో షేక్ ధర్వేషా – ఫాతిమాబి దంపతుల కుమారుడు షేక్ యాకుబ్ భాషా వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వివాహ వేడుక కార్యక్రమానికి ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు హాజరై, నూతన వధూవరులైన యాకూబ్ భాషా- హస్మ ఆశీర్వదించి,శుభాకాంక్షలు తెలిపి నూతన వధువు హస్మకు కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున పదివేల రూపాయలను పెళ్లి కానుకగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు అందించారు.ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు, కార్యకర్తలు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.