

మన న్యూస్,తిరుపతి: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి భారత కమ్యూనిస్టు పార్టీ( సిపిఐ) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలలో నిరుపేదలకు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చాలని పట్టణంలో రెండు సెంట్లు రూరల్ ప్రాంతంలో మూడు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిరుపేద కుటుంబాల నుంచి అర్జీలు సేకరించి ప్రజా సమస్యల పరిష్కరించాలని ఈనెల 6 వ తేదీ న స్థానిక ఆర్డిఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తామని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి మురళి తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు జనమాల గురవయ్య బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీరాములు, రూరల్ మండల కార్యదర్శి శివకుమార్, మహిళలు తదితరులు పాల్గొన్నారు