

మన న్యూస్,తిరుపతి: తిరుపతి విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో విజయవాడ కేంద్రంగా ఆదివారం జరిగే హైందవ శంఖారావం భారీ బహిరంగ సభకు టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి,డాలర్స్ గ్రూప్ అధినేత డాక్టర్ సి దివాకర్ రెడ్డి దైవ భక్తికి పునీతులై అభయహస్తానందించారు.ఈ మేరకు శనివారం రాత్రి ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి అశేష ప్రజానీకంతో బయలుదేరిన రైలును ఆయన తిరుపతి రైల్వే స్టేషన్ లో జెండా ఊపి సాగనంపారు.ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం హిందూ పరిషత్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.జిల్లా నుంచి వేలాదిమంది ప్రజలు హైందవ శంఖారావం సభకు తరలి వెళ్లడం సంతోషకరమన్నారు