యాదమరి, మన ధ్యాస డిసెంబరు-20 రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కె.గొల్లపల్లె హైస్కూల్ ప్లస్ నందు అవగాహన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి ఘన మరియు ద్రవ వ్యర్థాలను ఎరువులుగా మార్చి భూమి సాంద్రతను పెంచడంలో వాటి వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హెచ్.ఎం. కమ్ ప్రిన్సిపాల్ ఎ.పి.లలిత మాట్లాడుతూ, వ్యర్థాల సరైన నిర్వహణ ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు వ్యవసాయ ఉత్పాదకత పెరుగుతుందని తెలిపారు. విద్యార్థుల్లో పర్యావరణ బాధ్యతను పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని సైన్స్ ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు ఆష, రమాదేవి, చిట్టిబాబు వారి సహకారంతో విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇన్చార్జి జె.భాస్కర్ రెడ్డి, కనకాచారి, మదన్ మోహన్ రెడ్డి, దామోదర్ రెడ్డి, మధుసూధన్, కె.భారతి, మహేష్, సుధాకర్, షణ్మగం, చిన్నదొరై, మంజుల, మంజులత, రంగనాధం, రాజా తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెరిగి, స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి దోహదపడుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.