యాదమరి, మాన ధ్యాస డిసెంబరు-20 యాదమరి మండలంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేంద్రప్రసాద్ శుక్రవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉదయం 7.50 గంటలకు 14 కండిగ ఉర్దూ హైస్కూల్‌ను సందర్శించిన ఆయన, అనంతరం యాదమరి హైస్కూల్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థుల కోసం అమలు చేస్తున్న 100 రోజుల ప్రత్యేక కార్యక్రమంను పరిశీలించి, విద్యార్థుల స్లిప్ టెస్ట్ పరీక్ష పత్రాలను తనిఖీ చేశారు. ప్రత్యేక తరగతులకు విద్యార్థులందరూ తప్పనిసరిగా హాజరై, శ్రద్ధగా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని సూచించారు. లాంగ్ అబ్సెంట్ విద్యార్థులపై సి.ఆర్.పి లు మరియు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించి, వారిని తిరిగి పాఠశాలకు తీసుకురావడానికి కృషి చేయాలని ఆదేశించారు. అలాగే ప్రాథమిక స్థాయిలో అమలు చేసిన 75 రోజుల జి.ఎఫ్.ఎల్.ఎన్ కార్యక్రమం విజయవంతం కావడంలో ఉపాధ్యాయుల సహకారం ఎంతో కీలకమని తెలిపారు. ఈ కార్యక్రమాలు విద్యార్థుల విద్యాభివృద్ధికి దోహదపడతాయని అన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారితో పాటు మండల విద్యాశాఖ అధికారి హెచ్.ఎల్.ఎన్. ప్రసాద్ కూడా పర్యటించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌.యం హేమాలత, ఉపాధ్యాయులు మధు, తులసి ప్రసాద్, విజయకుమార్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *