మన ధ్యాస, నారాయణ పేట జిల్లా: ఎన్నికల ప్రక్రియ మొత్తం మూడు దశలు పూర్తిగా ముగిసే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) పూర్తి స్థాయిలో అమల్లోనే ఉంటుందని నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు.మొదటి దశలో నారాయణపేట జిల్లా నాలుగు మండలాల్లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఫలితాలు వచ్చినా, గెలిచిన అభ్యర్థులు లేదా వారి అనుచరులు విజయోత్సవ ర్యాలీలు, భారీ సమావేశాలు, బైక్ ర్యాలీలు వంటి కార్యక్రమాలు నిర్వహించడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు.శాంతి–భద్రతల పరిరక్షణ కోసం MCC పూర్తయ్యే వరకు ఈ ఆంక్షలను ఖచ్చితంగా పాటించాలని జిల్లా ఎస్పీ తెలిపారు.






