*బట్టీ చదువులు కాదు పరిశోధనాత్మక విద్య అవసరం.**గ్రామీణ ప్రాంతాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ లో ప్రతిభ చాటిన గీతం విద్యార్థులు.* మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :-బట్టీ చదువులు కాకుండా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను శాస్త్ర వేత్తలుగా తీర్చి దిద్దేందుకు పాఠశాల స్థాయి నుండి విద్యార్థులకు పరిశోధనాత్మక విద్య ను అందిస్తూ సింగరాయకొండ గీతం విద్యాసంస్థల విద్యార్థులు జిల్లా స్థాయిలో ప్రతిభను చాటారు. జిల్లా కేంద్రం లో గురువారం జిల్లా స్థాయిలో క్విజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఐ ఎస్ ఆర్ ఒ లు సంయుక్తంగా సైన్స్ ఎక్స్పో,డ్రాయింగ్,పోస్టర్ మేకింగ్ పోటీలు నిర్వహించారు.ఈ పోటీలలో జిల్లా లోని వివిధ ఇంజనీరింగ్ కళాశాలలు, విద్యాసంస్థల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలలో సింగరాయకొండ గీతం విద్యాసంస్థల విద్యార్థులు పాల్గొని తమ తమ పరిశోధనలను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనల్లో గీతం విద్యాసంస్థల కి చెందిన విద్యార్థులు జిల్లా ప్రథమ స్థానం సాధించి తమ సత్తా చాటారు. ఈ సందర్భంగా సైన్స్ ఎక్స్పో నిర్వహించిన నిర్వాహకులు ఐ ఎస్ ఆర్ ఒ టీం స్పందిస్తూ తీర ప్రాంత గ్రామాల లో జిల్లా స్థాయి లో సత్తా చాటే బాల శాస్త్ర వేత్తలను తీర్చి దిద్దే గీతం విద్యాసంస్థల నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా గీతం విద్యాసంస్థల నిర్వాహకులు లక్ష్మణ రావు మాట్లాడుతూ తమ విద్యాసంస్థల విద్యార్థులు బట్టి చదువులు కాకుండా చిన్న వయసు నుండే పరిశోధనాత్మక, ప్రయోగాత్మక విద్య, అవగాహన కి ప్రాధాన్యం ఇస్తూ తమ లోని మేధస్సుకు పదును పెడుతున్నారని దాని ఫలితంగానే జిల్లా స్థాయి సైన్స్ ఎక్స్పో లో ప్రథమ స్థానం సాధించ గలిగారని అన్నారు. విద్యార్థులు తమ ప్రతిభను చాటేందుకు కృషిచేసిన తమ బోధన సిబ్బందిని, ప్రిన్సిపాల్ తాజుద్దీన్ లను ఆయన అభినందించారు. సింగరాయకొండ గీతం విద్యాసంస్థల విద్యార్థులు జిల్లా స్థాయిలో నిర్వహించిన సైన్స్ ఎక్స్పో లో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థులను లైన్స్ క్లబ్ ఆఫ్ ఎస్ కొండ అభినందించింది.







