చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 7 :
చిత్తూరు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తుషార్ డూడిని జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి పలు ప్రజా సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
వినతిపత్రంలో ముఖ్యంగా ప్రస్తావించిన అంశాలు:
2019 – 2024 మధ్య టిడిపి కార్యకర్తలపై నమోదైన తప్పుడు కేసులను రద్దు చేయించి, వాటిపై సమగ్ర విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు.
చిత్తూరు జిల్లాలో విస్తరిస్తున్న గంజాయి సరఫరా, తమిళనాడు లాటరీ వ్యాపారాలను అరికట్టి, నిర్వీర్యం చేయాలని కోరారు.
అక్రమ వడ్డీ వ్యాపారులు, మైక్రో ఫైనాన్స్, ఆటో ఫైనాన్స్ దందాలను నిషేధించి, మధ్యతరగతి కుటుంబాలను రక్షించాలని విజ్ఞప్తి చేశారు.
గతంలో జరిగిన నిబంధనలకు విరుద్ధమైన పోలీసు బదిలీలను పునరాలోచించాలని, ఖాళీగా ఉన్న హోంగార్డ్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు.
డీజిల్ మాఫియా, కల్తీ మద్యం మాఫియాపై నిఘా పెట్టి, అలాగే వైసిపి నాయకులు నిర్వహిస్తున్న అక్రమ ఇసుక, మైనింగ్ వ్యాపారాలను అరికట్టాలని విజ్ఞప్తి చేశారు.
విదేశీ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేస్తున్న నకిలీ మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సప్తగిరి ప్రసాద్, టిడిపి కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేష్ యాదవ్, బీసీ సెల్ అధ్యక్షుడు ధరణి ప్రకాష్ పాల్గొన్నారు.







