యాదమరి, మన ధ్యాస అక్టోబర్ 7: జీఎస్టీ 2.0లో విద్యారంగానికి గణనీయమైన ఉపశమనం కలిగించడం హర్షణీయమని కె.గొల్లపల్లె హైస్కూల్ ప్లస్ ప్రిన్సిపాల్ ఎ.పి.లలిత అన్నారు. స్టేషనరీ వస్తువులపై భారీగా పన్ను తగ్గించడం ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులు లబ్ధి పొందుతారని ఆమె పేర్కొన్నారు. గతంలో నోట్స్ బుక్స్, మ్యాప్స్, అట్లాస్, గ్లోబులు, స్టేషనరీ వస్తువులపై 12 శాతం జీఎస్టీ ఉండగా, ఇప్పుడు శూన్య శాతం చేసినట్లు తెలిపారు. డ్రాయింగ్, ఆర్ట్ మెటీరియల్ పై 18 శాతం నుండి 5 శాతానికి తగ్గించారని, మాథ్స్ మెటీరియల్, జ్యామెట్రీ బాక్స్‌లపై 12 శాతం నుండి 5 శాతానికి తగ్గించడాన్ని అభినందించారని మండల విద్యాశాఖ అధికారి హెచ్.ఎల్.ఎన్.ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల కోసం వ్యాస రచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో పంచాయితీ సెక్రటరీ శైలజ, వెల్ఫేర్ అసిస్టెంట్ కవిత, ఉపాధ్యాయులు కనకాచారి, భాస్కర్ రెడ్డి, మధుసూధన్, దామోధర్ రెడ్డి, సుల్తాన్, చిన్నదొరై, షణ్ముగం, ఆశ, అరుణ, కె.భారతి, మంజులత, మంజుల, మహేష్, సుధాకర్, రాజేశ్వరి, నాగభూషణం, భారతి తదితరులు పాల్గొన్నారు.







