శంఖవరం మనధ్యాస ప్రతినిధి (అపురూప్): శంఖవరం మండల పాస్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం కొలువతీరింది. కాకినాడ జిల్లా శంఖవరం మండలం వజ్రకూటం లో శంఖవరం మండల పాస్టర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఆదేశాల మేరకు వారి ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం ప్రెసిడెంట్ గా దడాల యాకోబు (సిద్ధివారిపాలెం), వైస్ ప్రెసిడెంట్ గా వి.యస్. ప్రకాశ్ (వజ్రకూటం) సెక్రెటరీ గా దడాల జాన్సన్ (సీతంపేట)జాయింట్ సెక్రెటరీ గా గునపర్తి అపురూప్ (శంఖవరం)ట్రెజరర్ గా ఎ. ప్రసాద్ కుమార్ ( కత్తిపూడి ) జాయింట్ ట్రెజరర్ గా బి.దావీదు ( జి. కొత్తపల్లి ) మరియు కార్యవర్గ సభ్యులుగా పి. నానిబాబు,.కె. సామ్యేలు,పి. ప్రకాశ్, జి. యెహాను,కె. పద్మ ను నూతనంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శంఖవరం మండల పాస్టర్స్ అసోసియేషన్ గౌరవ అద్యక్షులు ఎమ్. బాస్కర రావు, ఎస్. మోహన్ కుమార్,ఎమ్. ప్రకాశ్, పి.టి. పాల్ పి. ఎలీషా నూతన కార్యవర్గ సభ్యులకి అభినందనలు తెలిపారు. అనంతరం శంఖవరం మండల పాస్టర్స్ అసోసియేషన్ నూతన ప్రెసిడెంట్ పాస్టర్ దడాల యాకోబు మాట్లాడుతూ, మండలంలో గల క్రైస్తవ సంఘాల పాస్టర్ల అభివృద్ధికి తోడ్పడతానని, క్రైస్తవులు మరియు పాస్టర్లపై జరుగుతున్న అన్యాయాలను అరికట్టేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. త్వరలో నూతన ప్రత్యేక కార్యచరణతో శంఖవరం మండల పాస్టర్స్ అసోసియేషన్ మరింత బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.









