మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:-
ప్రకాశం జిల్లాలో 2025 డీఎస్సీ ద్వారా నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు మంత్రి శ్రీ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ని తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో కలిసి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదములు తెలియజేశారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఉపాధ్యాయులకు మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రిగారు ఉపాధ్యాయులు ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలనీ, చిన్న వయసులోని ఉద్యోగాలు సాధించారు కాబట్టి వృత్తిలో ఆధునికతను జోడించి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి ఆశయాలకు అనుగుణంగా విద్యాశాఖను ప్రగతి పథంలో నడిపించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు దే న్నన్నారు.
తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు అర్రిబోయిన రాంబాబు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలోనే అత్యధిక డీఎస్సీల ద్వారా రెండు లక్షలకు పైగా ఉపాధ్యాయులను నియమించిన చరిత్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందనీ, ఆయన విజన్ ఉన్న నాయకుడనీ ప్రతి సంవత్సరం డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి శాఖను బలోపేతం చేస్తున్నారని ఉపాధ్యాయులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.
కార్యక్రమంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు అంబటి బ్రహ్మయ్య, జిల్లా ఎం ఐ ఎస్ కోఆర్డినేటర్ మసనం జాలరత్నం,ఉపాధ్యాయులు మసనం మాలిరావు, నక్కా శ్రీనివాసులు, పామర్తి ప్రదీప్, గుంటూరు సౌజన్య,షేక్ సుల్తాన్ బాబు, సదానంద్, డోలా హరిబాబు, ఆలా రామకృష్ణ,కరేటి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.









