శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్) ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో
“జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ” కార్యక్రమానికి విచ్చేస్తున్న కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ మరియు DCCB ఛైర్మన్ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల బాబు కు ప్రత్తిపాడు నియోజకవర్గ కత్తిపూడిలో
జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి
ప్రత్తిపాడు నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త మేడిశెట్టి సూర్యకిరణ్ (బాబి), జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు కరణం సుబ్రహ్మణ్యం, శంఖవరం మండల అధ్యక్షుడు గాబు సుభాష్, వాయిద్యాల నడుమ ఘన స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. అనంతరం నెల్లిపూడి గ్రామంలో శంఖవరం మండల ఉపాధ్యక్షుడు తలపంటి బుజ్జి ఆధ్వర్యంలో మహిళలు ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబుకి హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. అనంతరం భారీ గజమాలతో సన్మానించారు. అనంతరం తలపంటి బుజ్జి ఏర్పాటుచేసిన వాయిద్యాల సందడిలో జన సైనికులతో నాయకుల నృత్యం మరింత ఆకర్షినియంగా నిలిచింది.
అనంతరం నెల్లిపూడి శంఖవరం మధ్యలో గల అడ్డరోడ్డు లో గల శ్రీ వాణి నవదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయవాడ రైల్వే డివిజన్ కమిటీ సభ్యులు, కొంతంగి, కొత్తూరు జనసేన నాయకులు గొర్లి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జన సైనికులు ఘన స్వాగతం పలికి పూలమాలలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో జిల్లా జనసేన పార్టీ నాయకులు ప్రతిపాడు నియోజకవర్గ జన సైనికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.







