మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ
చెరువులు, దేవాదాయ శాఖ భూముల నుండి అనుమతి లేకుండా జరుగుతున్న మట్టి తవ్వకాలు, అక్రమ రవాణాపై సింగరాయకొండ పోలీసులు దాడులు నిర్వహించారు.ఇటుక బట్టీలకు ఉపయోగపడే ఎర్ర మట్టిని నిత్యం యదేచ్చగా తరలిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారుల సహకారంతో ఆదివారం పాత సింగరాయకొండ శివారు చెరువు వద్ద దాడి చేశారు.ఆ సమయంలో చెరువులో జేసీబీ, ట్రాక్టర్లతో మట్టి తవ్వుతూ, వాహనాల్లో నింపుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. సింగరాయకొండ ఎస్సై బండ్లమూడి మహేంద్ర, రెవెన్యూ అధికారి సింహాద్రి నేతృత్వంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.ఈ దాడిలో ఎస్సై మరియు సిబ్బంది పాల్గొన్నారు.









