తవణంపల్లె మన ధ్యాస సెప్టెంబర్-13
పార్వతీపురం మన్యం జిల్లా కొత్త కలెక్టర్‌గా నక్కల ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన స్వస్థలం అయిన చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలంలోని వెంగంపల్లెలో ఉత్సాహం వెల్లివిరిసింది. గ్రామంలో చిన్నా – పెద్దా అందరూ కలసి సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచా కాల్చి, కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచి గ్రామం అంతా పండుగ వాతావరణంగా మారింది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయన విజయాన్ని ఘనంగా జరుపుకున్నారు. గ్రామ పెద్దలు మాట్లాడుతూ – “మన ఊరి కొడుకు జిల్లా కలెక్టర్ స్థాయికి చేరుకోవడం గొప్ప గర్వకారణం. ప్రభాకర్ రెడ్డి కృషి, పట్టుదల అందరికీ ఆదర్శం” అని అభిప్రాయపడ్డారు. యువతలోనూ విశేష ఉత్సాహం నెలకొంది. “విద్యాభ్యాసం ద్వారా కష్టపడితే ఎలాంటి ఉన్నత స్థాయికి చేరుకోవచ్చో ప్రభాకర్ రెడ్డి నిరూపించారు” అని యువకులు వ్యాఖ్యానించారు. మొత్తం మీద, వెంగంపల్లె గ్రామం పండుగలా మారి, నక్కల ప్రభాకర్ రెడ్డి కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించడం గ్రామనీకె గర్వకారణంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో నక్కల ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు పాల్గొని ఆయన విజయాన్ని ఘనంగా జరుపుకున్నారు.











