

మన న్యూస్ చిత్తూరు ఆగస్ట్-16
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న జరిగినటువంటి 79వ స్వతంత్ర దినోత్సవ కార్యక్రమంలో కనీసం జాతీయ జెండా ఆవిష్కార కార్యక్రమంలో పాల్గొనకుండా తన యొక్క అహంకారాన్ని అహంభావాన్ని మరొకసారి చాటుకున్నారు. 79వ స్వతంత్ర దినోత్సవం కార్యక్రమాన్ని తన కార్యాలయంలో తన మాజీ సలహాదారుడైన సజ్జల రామకృష్ణారెడ్డి చేత జెండా ఎగర వేయించి… తాడేపల్లి లో తన నివాసంలో ఉంటూ కూడా ఆవిష్కరణ కార్యక్రమాన్ని బహిష్కరించడం, కనీసం ఒక జెండా వందనం కూడా చేయలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర రాజకీయాలకు అర్హుడు కాదని చిత్తూరు జిల్లా టిడిపి నాయకులు దుయ్యబట్టారు.
దేశం స్వతంత్రం కోసం వందలాది, వేలాదిమంది స్వతంత్ర సమరయోధులు తమ ప్రాణాల్ని, సర్వస్వాన్ని త్యాగం చేసి దేశానికి స్వతంత్రం తెచ్చిపెడితే కనీసం ఆ యొక్క స్వతంత్ర సమరవీరుల యొక్క పోరాటానికి చిహ్నంగా జండా ఆవిష్కరణలో కూడా పాల్గొనక పోవడం తన యొక్క నిజస్వరూపాన్ని మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి చాటుకున్నారు.
అసలు జగన్మోహన్ రెడ్డి ఈ భారత దేశంలో పుట్టాడా అని అనుమానం కలుగుతుంది? ఎంతసేపు ధనార్జన, దోపిడీ తప్పించి మరొక ధ్యాస లేని జగన్మోహన్ రెడ్డి మువ్వన్నెల జెండా ని, స్వతంత్ర సమరయోధులను అవమానపరచడమే అవుతుంది.
జగన్మోహన్ రెడ్డి కి మొన్న జరిగినటువంటి పులివెందుల ఎన్నికల్లో ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించారని, ప్రజల పైన, తన సొంత నియోజకవర్గ ఓటర్ల పైన తీవ్ర అగ్రహంతో ఉన్న సందర్భంగా తన కోపాన్ని ఈ విధంగా స్వతంత్ర సమరయోధుల పైన, జెండా పైన చూపించడం తన మూర్ఖత్వమే అవుతుంది అని టిడిపి నాయకులు అన్నారు. మరోపక్క ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పిన మాట చెప్పినట్లుగా ఇచ్చిన హామీ ఇచ్చినట్లుగా సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా అమలు చేస్తుండటంతో తీవ్రమైనటువంటి నిరాశకు కూడా లోనై జండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి బహిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సప్తగిరి ప్రసాద్, టిడిపి కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, జిల్లా క్రిస్టియన్ అధ్యక్షులు మేషక్ పాల్గొన్నారు.