• శ్రీ కనక మహాలక్ష్మి ధర్మకర్తల మండలి చైర్మన్ కందుల నాగరాజు..
  • శ్రీ కనకమహాలక్ష్మి ఆలయ ఈ ఓ ఎన్.సుజాత..

బురుజు పేట మన ధ్యాస ప్రతినిధి ఆగస్టు 13:కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం సందర్బంగా శ్రావణలక్ష్మీ పూజలు నేడు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా శ్రావణలక్ష్మీ పూజలను ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ కందుల నాగరాజు చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమమును లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గణపతి పూజ నిర్వహించి తదుపరి శ్రీ అమ్మవారికి విశేషపూజ నిర్వహించారు.వేదమంత్రోచ్ఛారణల మధ్య నాదస్వర సుస్వరాలు మధ్య శ్రావణలక్ష్మీ పూజలు ప్రారంభించారు.ఈ పూజలో 25 మంది స్వయంగా పాల్గొన్నాను మరియు పూజలు ద్వారా ఇద్దరు భక్తుల పైన పూజ నిర్వహించి వారి ప్రసాదములు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ధర్మకర్త మండలి చైర్మన్ కందుల నాగరాజు మాట్లాడుతూ శ్రావణమాసం మహిళలకు ఎంతో ప్రీతి ధాయమైన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి కరుణాకటాక్షాలతో కుంకుమ పూజలు,అభిషేకాలు,విశేష పూజలు నిర్వహిస్తున్నామని మహిళలందరూ కూడా భక్తిశ్రద్ధలతో అమ్మవారిని ప్రార్థించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపకమిషనర్ &కార్యనిర్వహణాధికారిణి శ్రీమతిఎన్.సుజాత, ధర్మకర్తలుశ్రీమతి టి.వేద కుమారి,శ్రీమతి కె. స్వరూప రాణి,ఎన్.రామారావు,డి.శ్రీకాంత్, శ్రీమతి ఎం.నాగ సుధ,శ్రీమతి సిబిహెచ్. మంజుల,శ్రీమతి కె.అనురాధ,శ్రీమతి టి. నాగమణి,సహాయ కార్యనిర్వహణాధికారి కె. రాజేంద్ర కుమార్,పర్యవేక్షకులు ఎం.డి.రమణ మరియు వేదపండితులు,అర్చకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *