ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పరిపాలనలో అభివృద్ధి పదంలో రాష్ట్రం…………. తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి, ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు :నెల్లూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి.ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి.ఈ సందర్భంగా పోలంరెడ్డి దినేష్ రెడ్డి మాట్లాడుతూ……..చంద్రబాబుకి శాపనార్థాలు పెట్టడం జగన్ ఫ్రస్ట్రేషన్ కి నిదర్శనం అని అన్నారు.వయసు కేవల ఒక నెంబర్ మాత్రమే బాబు కి పనిచేయడంలో వయసుతో సంబంధం లేదు అని అన్నారు.చంద్రబాబు అనే జగన్ ఆయన చేసిన పనులకు ఏలోకంలోకి పోతారు అని అన్నారు.జగన్ కి ఛాలెంజ్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమం గురించి చర్చకి సిద్ధమా అని అన్నారు.సంక్షేమ అందించడంలో మరో విజయం స్త్రీ శక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని అన్నారు.రాష్ట్రం సుభిక్షంగా ఉండటం చూసి భరించలేని జగన్ మతి భ్రమించి మాట్లాడుతున్నారు అని అన్నారు.గత ప్రభుత్వంలో జగన్ చేసిన అరాచకాలకు ప్రజలు ఇప్పటికే బుద్ధి చెప్పారు అని అన్నారు.ఇప్పటికీ అయినా జగన్మోహన్ రెడ్డి మారకపోతే ఆయన పార్టీ భూస్థాపితం కావడం తధ్యం అని అన్నారు.కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సూపర్ సిక్స్ కార్యక్రమంలో నిన్న ప్రారంభించిన స్త్రీ శక్తి లో భాగంగా మహిళ ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి విద్యాశాఖ మంత్రి యువగళం అధినేత లోకేష్ కి ధన్యవాదాలు తెలుపుతూ ఈ పథకంతో చెప్పిన హామీల్లో 80 శాతం పూర్తి చేసినట్టు అవుతుంది అని తెలియ చేశారు.ఇప్పటికే ప్రారంభించిన ఫెన్షన్లు,ఉచిత సిలిండర్లు,అన్నదాత,చేనేతకు సహకారం,మత్స్యకార బరోసా లాంటి పథకాలను అమలు చేయడంతో పాటు ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం కూడా అమలు చేయడంతో రాష్ట్ర లో ప్రజలకు అసలైన సంక్షేమం అందించడంలో కూటమి ప్రభుత్వం విజయవంతం అయ్యింది అని తెలిపారు.అభివృద్ధి విషయంలో అమరావతి నిర్మాణం పరుగులు తీస్తుంటే,పోలవరం, పట్టిసీమ,హంద్రీనీవా లాంటి ప్రాజెక్టులు ఊపిరి పోసుకుని ముందుకు సాగుతున్నాయి అలానే పారిశ్రామిక అభివృద్ధి కొనసాగుతుంది, పి 4 విధానంతో బంగారు కుటుంబాలకు చేయూత అందిస్తున్నారు అని తెలిపారు.ఇలా సంక్షేమం అభివృద్ధి రెండు పరుగులు తీస్తూ రాష్ట్ర ప్రజలు ఆనందాల్లో ఉంది వైకాపా అనే హింసాత్మక పాలన నుండి విముక్తి చెందాం అనే ఆలోచనలోనే ఇప్పుడు జరిగిన పులివెందుల ఒంటిమిట్ట ఎన్నికలలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి ను ఆయన పార్టీని వదిలించుకుని టీడీపీ నీ గెలిపించడం జరిగింది అని తెలిపారు.సొంత ఇలాకాలో డిపాజిట్లు కోల్పోయిన జగన్మోహ రెడ్డి విచక్షణా కోల్పోయి బాబుని వయసు ఐపోయింది, నరకానికి పోతారు లాంటి మాటలు మాట్లాడటం ఆయన ఫ్రస్ట్రేషన్ తెలియ చేస్తున్నారు అని తెలిపారు.బాబు కి వయసు కేవలం ఒక నెంబర్ లాంటిది అని ఈ వయసులో కూడా రాష్ట్రం కోసం ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి లా కూర్చోడం వంగడం కూడా చేయలేని పరిస్థితిలో లేరని ఎద్దేవా చేశారు.రాష్ట్ర విభజన జరిగి ఆర్థిక లోటులో ఉన్న ప్రభుత్వన్నీ దారిలో పెట్టడానికి 2014 నుండి 2019 వరకు ఆనాడు చంద్రబాబు గారు చేసిన కృషి పలితంగానే నేడు ఇలా అయినా ఉన్నాం అమరావతి నిర్మాణం ప్రారంభించడం.రైతు సంక్షేమం కోసం నీటి ప్రాజెక్టులు, ఎస్సీ ఎస్టీ, బిసి ల కోసం ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేయడం,పారిశ్రామిక ఐటీ విప్లవం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించిన చంద్రబాబు ని నరకానికి పోతారు అని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు పులివెందుల ఎన్నికల ఫలితాలు ద్వారా సరైన సమాధానం చెప్పారు అని తెలిపారు.ఇదే జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్ ని హింసించిన విధానం,చంద్రయ్య ను నడివీధుల్లో గొంతు కోసిన ఘటనలో,లిక్కర్ స్కాంలో కల్తీ దొంగ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడిన జగన్మోహన్ రెడ్డి. ఎస్సీ ,ఎస్టీ, బీసీ నిధులు దించుకుని రాష్ట్రాన్ని దివాలా తీయించడమే కాక కక్ష సాధింపులతో నరమేధం చేసిన జగన్మోహన్ రెడ్డి ఏ లోకానికి పోవాలి అని అసలు ఇతనికి శిక్ష విధించడానికి లోకాలు ఉన్నాయా అని ప్రశ్నించారు.వైకాపా పార్టీకి ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ అభివృద్ధి సంక్షేమం విషయంలో ఎటువంటి చర్చకు ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి సిద్ధంగా ఉన్నానని దమ్ముంటే చర్చకు రావచ్చు అని సవాలు విసురుతూ.ఇప్పటికి ఆయన జగన్ అనుచిత మాటలు మాట్లాడటం మానుకోవాలని హితవు పలుకుతూ లేకుంటే వైకాపా పార్టీని ప్రజలు భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి అమరేంద్ర రెడ్డి, చెముకుల కృష్ణ చైతన్య, చెంబేటి పెంచలయ్య, బాలా రవి,ధరా విజయ్,నాటకరాణి వెంకట్, కొప్పర్తి హరనాథ్, సింధూర్,తాళ్ళ నరసింహస్వామి, సొల్లేటి ప్రభాకర్,శ్రీపెరంబధూర్ సాయి కృష్ణ, దండూరు ప్రసాద్,తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 2 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు