శ్రీ భక్త మార్కండేయ పల్లకిసేవ మహోత్సవ ఆహ్వానం.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : పద్మశాలి కుల భాంధవులకు మరియు నారయణ పేట పట్టణ ప్రజలకు శ్రీ భక్త మార్కండేయ స్వామి పల్లకి సేవ మహోత్సవానికి ఆహ్వానిస్తూ,స్వామి వారి పూజ కార్యక్రమలో పాల్గొనాలని దేవాలయ కమిటీ సభ్యులు కోరారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ,ప్రతి ఏటా జరిగే విధంగానే ఈ ఏడాది కూడా స్వామి వారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని దేవాలయ కమిటీ నిర్ణయించిందని,కొన్ని తరాలుగా జరుగుతున్న ఉత్సవాల్లో పద్మశాలి కుల భాంధవులు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి పాల్గొనాలని, స్వామి వారి ఆశీస్సులు పొందాలని అన్నారు.పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సుభాష్ రోడ్ లో గల మార్కండేయ ఆలయం లో నిర్వహించే పల్లకి సేవ కార్యక్రమం తో పాటు స్వామి వారీ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్టు కమిటీ సభ్యులు తెలిపారు. అందులో భాగంగా తేదీ 8 శుక్రవారం రోజు రాత్రి గం,, 9:30 ని,,లకు భజన కార్యక్రమం తో మొదలు పెట్టి అదే రోజు రాత్రి జాగరణ కార్యక్రమం జరుపబడును. తేదీ 9 శనివారం నాడు ఉదయం 9 గంటలకు హోమం మరియు హోమం అనంతరం యజ్ఞోపదారిని(జంజం ధారణ) ,సాయంత్రం 4 గంటలకు స్వామి వారి పల్లకి సేవ ఊరేగింపు దేవాలయం నుండి బయలుదేరి చౌక్ బజార్ మీదుగా శ్రీ అనంతశయన దేవాలయం వరకు వెళ్లి దర్శనం గావించి తదుపరి అదే దారి గుండా మార్కండేయ దేవాలయం చేరుకుని మహా మంగళ హారతి తో కార్యక్రమం ముగుస్తుందని అన్నారు. కావున భక్తులు మరియు హిందూ బంధువులు,కుల భాంధవులు మహిళలలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని కొరారు.కార్యక్రమ దృష్ట్యా విజయమంతంగుటకు ప్రతి సభ్యుడు తమ వార్షిక చందాను సహాయ సహకారాలకు అందించాలని సూచించారు. ముఖ్య గమనిక పత్రిక మరియు మీడియా ప్రతినిధులకు మా విన్నపం, దేవాలయ కార్యక్రమాలు ప్రచురించి తమ వంతు కృషి గా దేవాలయ అభివృద్ధికి తమరి సేవలు అందిస్తారని ఆశిస్తున్నమన అన్నారు.ఆహ్వానించు వారు కమిటీ సభ్యులు ,అధ్యక్షులు డా,,క్యాతన్ రఘునాథ్, ప్రధాన కార్యదర్శి క్యాతన్ తిలక్, ఉపాధ్యక్షులు సంబరి శ్రీను,తాటి కృష్ణ,కార్యవర్గ సభ్యులు నీలి శ్రీనివాస్,కర్లీ రాజశేఖర్.

Related Posts

హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 2 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు