

మన న్యూస్,రేణిగుంట జూలై 23:– దోమల వలన కలిగే వ్యాధుల నివారణకు” ఫ్రైడే”డ్రై డే”కచ్చితంగా పాటించాలని కోరుతూ విస్తృతంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సబ్ యూనిట్ ఆఫీసర్ వెంకటయ్య తెలియజేశారు. మంగళవారం తారక రామా నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గుత్తి వారి పల్లె గ్రామం నందు ఇంటింటికి వెళ్లి లార్వా సర్వే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూడెంగ్యూ మాసో త్సవాల్లో భాగంగా సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని అదేవిధంగాగ్రామీణ ప్రాంత ప్రజలు ఇళ్లల్లో నీటి నిల్వలను ఉంచరాదని సూచించారు. యాంటీ లార్వా ఆపరేషన్ నిర్వహించి దోమలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు అలాగే పాత టైర్లు, వాడిన కొబ్బరి బోండాలు చుట్టుపక్కల ప్రాంతాల్లో లేకుండా చూసుకోవాలన్నారు. వారం రోజులు బకెట్లు, డ్రమ్ములు, నీటి తొట్టిలో టైర్లు, బాటిల్స్ నందు నీరు నిల్వ ఉంటే వారం రోజుల తర్వాత వాటిలో దోమలు ఉత్పత్తి అయ్యి,డెంగ్యూ మలేరియా, బోదకాలు, మెదడువాపు, చికెన్ గున్యా, వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. దోమ కాటుకు గురికాకుండా దోమతెరలు వాడాలన్నారు. రాత్రిపూట వేపాకు పొగ వేసుకోవాలన్నారు. ఇంటి పరిసర ప్రాంతాలను మురికి నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. అదేవిధంగా ఇంటి పరిసర ప్రాంతాల్లో పేడ దిబ్బలు, పశువుల కొట్టాల దగ్గర పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.ప్రస్తుతం వర్షాకాలం వ్యాధుల కాలం అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం హెల్త్ సూపర్వైజర్ పుష్పవతి మాట్లాడుతూ వ్యాధులపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలన్నారు. నిర్లక్ష్యం వహించకుండా బోర్లు దగ్గర, బట్టలు ఉతకడం లాంటివి అక్కడ నీళ్లు నిలువ ఉండటం ద్వారా దోమలు ఉత్పత్తి అయ్యి వ్యాధులు వచ్చే అవకాశాలు ఆరోగ్య సూత్రాలను పాటించి ఆరోగ్యంగా ఆరోగ్య శాఖ సిబ్బందికి సహకరించాలని కోరారు.ఆరోగ్య కార్యకర్త, ఆశా కార్యకర్తలు హంస, కుమారి,తదితరులు పాల్గొన్నారు.