

మన న్యూస్ సాలూరు జూలై 16:- పార్వతీపురం మన్యం జిల్లాసాలూరు మండలం చంద్రంపేటలో ఉన్న టిడ్కో గృహాలను పరిశీలించిన టిడ్కో చైర్మన్ గత వైసిపి ప్రభుత్వ హయాంలో 1248 టిడ్కో ఇళ్లను అయితే నిర్మించి లబ్దిదారులకు అప్పజెప్పారు. అంతవరకు బాగానే వుంది కాని, మౌలిక వసతులు కల్పించడంలో వైసిపి ప్రభుత్వం విఫలం అయిందని బుధవారము సందర్శించిన కూటమి ప్రభుత్వం టిడ్కో చైర్మన్ విజయకుమార్ అన్నారు. ముందుగా లబ్ధిదారులు తమకు డబ్బులు కట్టినా ఇళ్లు మంజూరు చెయ్యలేదని చెప్పిన వాల్లు కొందరైతే, 50 వేలు కట్టించుకొని డబుల్ బెడ్ రూం ఇస్తామని చెప్పి, ప్రీ ఇళ్లను కట్టబెట్టి అధికారులు చేతులు దులుపుకున్నారన్నారని వాపోయారు.. మేం కట్టిన 50వేలు తిరిగి ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారని తమ గోడును టిడ్కో చైర్మన్ ముందు వెళ్లగక్కారు. 2014 లో తెలుగుదేశం ప్రభుత్వం లో 4 లక్షల 52 వేలు ఇళ్లను లబ్దిదారులకు కట్టడానికి సన్నాహాలు చేస్తే, 2019లో వైసిపి ప్రభుత్వం 2 లక్షల 61 వేలు ఇళ్లకు కుదించారన్నారు. 1 లక్షా 90 వేలు ఇళ్లకు మౌలిక సదుపాయాలు లేకుండా లబ్దిదారులకు అంటగట్టారన్నారు. పైపెచ్చు మీకు ఇచ్చిన ఇళ్లపై వైసిపి ప్రభుత్వం బ్యాంకులో రుణాలు చేసి మీ నెత్తిన అప్పు పెట్టారని వైసీపీ ప్రభుత్వాన్ని కిట్కో చైర్మన్ అజయ్ కుమార్ వైసిపి ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. అలాగే వైసిపి ప్రభుత్వం టిడ్కో కాంట్రాక్టర్లకు 2,800 కోట్లు బకాయి వున్నారన్నారు.. లబ్దిదారులు కట్టవలిసిన బ్యాంక్ ఈఎమ్ఐలు కూటమి ప్రభుత్వమే కట్టి మీకు అప్పజెప్పుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాలకొండ ఎమ్మెల్యే నిమ్కక జయరాజ్, కాపు కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశశ్వని, సాలూరు పట్టణ ఇన్చార్జి శివ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
