

మన న్యూస్ సింగరాయకొండ:-
చిన్న నాటి నుండే చిన్నారుల్లో క్రమశిక్షణ దేశభక్తి,విద్యాభివృద్ధి పై ప్రత్యేక దృష్టి తో తీర్చిదిద్దడమే బాల వికాస్ కేంద్రాలు అని వాటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సమరసత సేవా ఫౌండేషన్ బాల వికాస్ కేంద్రాల జిల్లా సంయోజక్ అర్రిబోయిన రాంబాబు పిలుపు ఇచ్చారు. గురువారం గురు పూర్ణిమ సందర్భంగా సింగరాయకొండ మండలంలో దేవాలయాల కేంద్రంగా నిర్వహించనున్న బాల వికాస్ కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సరసత కార్యకర్త శ్రీరామ మూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు . ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ దేవాలయాల కేంద్రంగా నివాస ప్రాంతాల్లో ఉండే దేవాలయాల కేంద్రంగా బాల బాలికల లో దేశభక్తి, దైవ భక్తి సంస్కారాలు ప్రధానంగా బాల వికాస్ కేంద్రాలు నిర్వహించడం జరుగుతుందని స్పష్టం చేశారు. సంస్కారం తో పాటు చదువు, కలలు, ఆటలు, పెద్దల పట్ల గౌరవ భావం పెంపొందించడం ప్రధానంగా నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.ప్రకాశం జిల్లా లో 27 కి పైగా బాల వికాస్ కేంద్రాలను వివిధ మండలాల లో ఆయా ప్రాంతాల సంయోజకులు బాల వికాస్ కేంద్రాలను ప్రారంభించారని రాంబాబు పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో అర్చకులు, మాతాజీ లు, తల్లి దండ్రులు, బాల బాలికలు, ఆలయ కమిటీల సభ్యులు పాల్గొన్నారు.