

మన న్యూస్ తవణంపల్లె జులై-10
తొడతర గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జూలై 10న నిర్వహించిన మెగా పేరెంట్స్-టీచర్ మీటింగ్ ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెర్వో శ్రీ సుధాకర్ గారు హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, ఎస్ఎంసి సభ్యులు, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, పూర్వ విద్యార్థులు, దాతలు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సమావేశంలో విద్యార్థుల ప్రగతి, హాజరు, నైతిక విలువలు, ప్రవర్తన, మరియు విద్యా నాణ్యతపై చర్చ జరిగింది. తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు వ్యక్తిగతంగా ఫీడ్‌బ్యాక్ పంచుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఎమ్మెర్వో సుధాకర్ మాట్లాడుతూ: “విద్యార్థుల భవిష్యత్ బలంగా ఉండాలంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసికట్టుగా పనిచేయాలి. పాఠశాల అభివృద్ధికి ప్రతి ఒక్కరి సహకారం అవసరం” అని చెప్పారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్. శ్రీనివాసులు మాట్లాడుతూ,
“పూర్వ విద్యార్థులు, దాతల సహకారంతో పాఠశాలలో మరిన్ని వసతులు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం” అని తెలిపారు.
ఈ కార్యక్రమం అనంతరం పాఠశాల అభివృద్ధి, మానవ విలువలు, మరియు విద్యా ప్రమాణాలపై ప్రత్యేక ప్రదర్శనలు కూడా నిర్వహించబడ్డాయి. తల్లిదండ్రులు తమ అభిప్రాయాలను తెలియజేస్తూ, విద్యారంగంలో ఈ తరహా సమావేశాలు ఎంతో ప్రోత్సాహకరమని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమం విద్యార్థులకు ఉత్తమ భవిష్యత్తు రూపకల్పనలో మరింత ముందడుగు వేసినట్టు స్పష్టమవుతోంది తెలియజేసారు. అలాగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు తో విద్యార్థులు తల్లిదండ్రులను అలరించారు. అలాగే ఏం ఆర్ ఓ సుధాకర్ చేతుల మీదుగా చెట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేసి తల్లిదండ్రులలో ఉత్సహం నింపారు. అలాగే ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు కలిసి సహపంక్తి భోజనం చేసి తద్వారా సమావేశానికి వీడ్కోలు పలికారు.


