

మన న్యూస్ ,నెల్లూరు:నెల్లూరు 49 వ డివిజన్ జయలలిత నగర్ ఆరవపాలెం లో పోలేరమ్మ జాతరకు వై ఎస్ ఆర్ సి పి నెల్లూరు సిటీ ఇన్ చార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరై.. ఆలయంలో అమ్మ వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్బంగా ఆలయ నిర్వాహకులు.. చంద్రశేఖర్ రెడ్డి కి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణం మొత్తం తిరిగి చంద్రశేఖర్ రెడ్డి భక్తులను.. పలకరించారు. పోలేరమ్మ జాతరకు విచ్చేసి అమ్మ వారి ఆశీస్సులు అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. స్థానిక ప్రజలు పోలేరమ్మ జాతరను ఎంతో చక్కగా నిర్వహించారని తెలిపారు.ఈ కార్యక్రమంలో వై సి పి జిల్లా ఉపాధ్యక్షులు మజ్జిగ జయకృష్ణ రెడ్డి , వై సి పి నాయకులు ఖాదర్, సింగంశెట్టి అశోక్, సుమధర్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

