నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జ్ అండ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు

మన న్యూస్, నెల్లూరు :నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ లో మంగళవారం దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి కార్యక్రమం.. వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇన్ చార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.ఈ సందర్బంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాకాణి పూజితమ్మ వైఎస్ఆర్సిపి నెల్లూరు పార్లమెంట్ పరిశీలకులు జెంకె వెంకటరెడ్డితో కలిసి.. వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇన్ చార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు.. 300 మంది హాజరై.. జోహార్ వైయస్సార్.. నినాదాలతో రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి అందించిన సేవలు ఎనలేనివని వైఎస్ఆర్సిపి నెల్లూరు పార్లమెంట్ పరిశీలకులు జంకె వెంకటరెడ్డి కాకాని పూజిత తెలిపారు . 108, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు.. లబ్ధి చేకూర్చయాని తెలిపారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ఈ రాష్ట్రానికి అందించిన సంక్షేమ, అభివృద్ధి పాలనను ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారని అన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ…….ఈ రోజు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని ఆ మహానేత సేవలను స్మరించుకోవడం ఎంతో సంతోషకరమన్నారు. రైతులకు ఉచిత విద్యుత్, 108,104 సేవలు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఇందిరమ్మ ఇల్లు..ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను రాజశేఖర్ రెడ్డి పేద బడుగు బలహీన వర్గ ప్రజలకు అందించారని తెలిపారు. ఈరోజు రాజశేఖర్ రెడ్డి అందించిన సేవలను స్మరించుకుంటూ ప్రజలు ఆయన్ని దైవంగా కొలుస్తున్నారని అన్నారు. రాజశేఖర్ రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ.. గత వైసిపి ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సంక్షేమ అభివృద్ధి పాలన అందించారని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి ఆశయాలతో.. సాగిన జగన్మోహన్ రెడ్డి పాలనను ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కోరుకుంటున్నారని..త్వరలో అది సాధ్యపడుతుందన్నారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, డివిజన్ ఇన్చార్జులు, జిల్లా అనుబంధ సంఘాల నేతలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

  • Related Posts

    నేలతల్లి ఆరోగ్యమే మన ఆరోగ్యం

    పాచిపెంట,,మన న్యూస్ , జూలై 9:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలోపంటలు పండించే భూమి ఆరోగ్యంగా ఉంటే ఆ పంటలు తినే మనుషులు ఆరోగ్యంగా ఉంటారని పాంచాలి సర్పంచ్ గూడెపు యుగంధర్ అన్నారు. బుధవారం నాడు మండలం పాంచాలి గ్రామంలో…

    పంచాయతీల పురోగతి పై శిక్షణ

    మన న్యూస్ పాచిపెంట, జూలై 9:- పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట పంచాయితీలు అభివృద్ధి, పురోగతి సూచిక పై పంచాయితీ కార్యదర్శులు కి ఇంజనీరింగ్ సహాయకులకి డిజిటల్ సహాయకులకి మండల స్థాయి అధికారులకి ఒకరోజు శిక్షణ ఇవ్వడం జరిగిందని పాచిపెంట ఎంపీడీవో బి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నేలతల్లి ఆరోగ్యమే మన ఆరోగ్యం

    నేలతల్లి  ఆరోగ్యమే మన ఆరోగ్యం

    పంచాయతీల పురోగతి పై శిక్షణ

    పంచాయతీల పురోగతి పై శిక్షణ

    వ్యాపారి ఇందూరి నాగభూషణరావు ఆత్మహత్య…

    వ్యాపారి ఇందూరి నాగభూషణరావు ఆత్మహత్య…

    దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె

    దేశవ్యాప్తంగా  సార్వత్రిక   సమ్మె

    రాష్ట్రస్థాయి విజేతలకు బహుమతులు అందజేసిన డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్..

    రాష్ట్రస్థాయి విజేతలకు బహుమతులు అందజేసిన డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్..

    జే.వివి. ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు భోజనాలు పంపిణీ….

    జే.వివి. ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు భోజనాలు పంపిణీ….