

మన న్యూస్,తిరుపతి :
దేశ వ్యాప్తంగా మెడికల్ రిప్రజెంటేటివ్ ల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 9వ తేదీ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలలో, జిల్లాలలో ఒకరోజు సమ్మె చేయనున్నట్లు మెడికల్ రిప్రజెంటేటివ్ ల మెడికల్ రిప్రజెంటేటివ్ ల రాష్ట్ర ప్రతినిధి నాదెండ్ల జగదీష్ ఒక ప్రకటనలో తెలిపారు. కార్పొరేట్ మెడికల్ షాపుల యజమానులు ఇష్టం వచ్చిన రీతిలో అనుమతులు లేని ఔషధాలను విక్రయించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. తాము పని చేస్తున్న కంపెనీల తాము చేస్తున్న పనికి తగ్గ వేతనాలు ఇవ్వడం లేదని, ఎలాంటి ఆరోగ్య భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పిఎఫ్, పిఎఫ్ మంజూరు చేసిన దాఖలాలు లేవన్నారు. తాము పని చేస్తున్న కంపెనీలు తమకు ఇవ్వాల్సిన పిఎఫ్ పెట్టాల్సిన డబ్బులను తామచేత వసూలు చేయడం దారుణం అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఆయా కంపెనీలే పిఎఫ్ అమౌంట్ చెల్లించాల్సి ఉండగా తమ వద్ద ముక్కు పిండి వసూలు చేయడం దారుణం అన్నారు. చాలీచాలని జీతాలతోనే కుటుంబాలను నెట్టుకు రావడం చాలా దారుణంగా ఉందని ఈ విధానాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చొరవ తీసుకొని తమకు న్యాయం జరిగేలా చూడాలన్నారు.
