

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : లయన్స్ క్లబ్ ఆఫ్ మఖ్తల్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతమైందని అధ్యక్షుడు డీవీ చారి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాలమూరు కందూరు రాంరెడ్డి కంటి ఆసుపత్రి సౌజన్యంతో డిస్ట్రిక్ట్ విజన్ చైర్మన్ అనుకొండ శ్రీనివాసులు సహకారంతో నిర్వహించడం జరిగిందని అన్నారు.కంటి వైద్య శిబిరంలో 30 మంది గాను మహబూబ్నగర్ నందు రామ్ రెడ్డి కంటి హాస్పిటల్ కు ఆపరేషన్ చేయించేందుకు తరలించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కోశాధికారి కె అంజన్ ప్రసాద్, ఎలక్ట్ ప్రెసిడెంట్ సత్య ఆంజనేయులు, ఎలక్ట్ కోశాధికారి స్వాగత్ సత్యం, సభ్యులు మామిళ్ల పృథ్వీరాజ్, వైద్య సిబ్బంది ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.