

గూడూరు, మన న్యూస్:- రైలు పట్టాలు దాటుతూ గూడూరు రెండో పట్టణ 27వ వార్డు ప్రధాన కార్యదర్శి బుజ్జ వెంకటసుబ్బయ్య దుర్మరణం చెందిన సంఘటన సోమవారం గాంధీ నగర్ సమీపంలోని రైలు పట్టాలపై చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల సమాచారం మేరకు బొజ్జ వెంకటసుబ్బయ్య తనకి ఉన్న మూగజీవాలను మేపుకుంటూ రైలు పట్టాలు పై వెళ్లే క్రమంలో గుర్తుతెలియని రైలు ఢీకొని మృతి చెందినట్లు వెల్లడించారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బొజ్జ వెంకటసుబ్బయ్య తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, గూడూరు రెండో పట్టణంలోని 27వ వార్డు ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.ఆయన మృతి పట్ల గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ సంతాపం తెలిపారు.