

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : ప్రతి నెల చివరి రోజు సోమవారం జిల్లా న్యాయ సేవా అధికార ప్రధాన న్యాయమూర్తి శ్రీ బోయ శ్రీనివాసులు నారాయణ పేట టౌన్ కిడ్స్ హోమ్ మాంటిస్సోరి స్కూల్ ను అకస్మాత్తుగా పర్యటన చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ స్వామి వివేకానంద విద్యార్థుల కోసం అనేక స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు చేశారు, ఆయన బోధనలు విద్యార్థులకు స్ఫూర్తినిస్తూ, వారి వ్యక్తిత్వ వికాసానికి, సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని సూచించారు, విద్య వ్యక్తిత్వ వికాసానికి మూలం, విద్యార్థుల కోసం స్వామి వివేకానందపై నమూనా వ్యాసం తెలిపారు. నిజమైన విజయం యొక్క గొప్ప రహస్యం, నిజమైన ఆనందం యొక్క రహస్యం ఇది: తిరిగి రాబడి కోరని పురుషుడు లేదా స్త్రీ, పరిపూర్ణ నిస్వార్థ వ్యక్తి, అత్యంత విజయవంతమవుతాడు అని అన్నారు. విద్య అనేది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడానికి, మనస్సును బలోపేతం చేయడానికి మరియు తెలివితేటలను విస్తరించడానికి సహాయపడుతుందని అన్నారు.విద్య ద్వారా విద్యార్థులు తమ కాళ్ళపై తాము నిలబడగలగాలి, బుక్స్ చదవాలి అన్నారు. అందరు ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని మంచి మంచి స్థాయిలో ఉండాలి విద్యార్థులను ఎచ్చరించారు. విద్యను సమాజానికి సేవ చేయడానికి ఉపయోగించాలని, విద్యార్థులకు ధైర్యంగా ఉండాలని, తమ లక్ష్యాలను సాధించడానికి సంకల్పంతో పనిచేయాలని సూచించారు.ముఖ్యమైన సూక్తులు:”ఎవరినైనా, దేన్నైనా ద్వేషించడం కంటే, వారినితదుపరి న్యాయమూర్తి అల్పాహారం విద్యార్థులకు అందజేశారు. క్షమించడం గొప్పది.””శక్తి, ధైర్యం, నమ్మకం మరియు ఆశతో ముందుకు సాగండి.” విద్యార్థులతో ఆయన చెప్పారు. తదుపరి పాఠశాల ప్రిన్సిపాల్ మరియు కరెస్పాండ్ వరలక్ష్మి మాట్లాడుతూ, ముందుగా న్యాయమూర్తి గారు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు అందరూ న్యాయమూర్తి గారు చెప్పిన ప్రతి విలువైన సందేశాలు, మాటలు పట్టించాలి అన్నారు.