గూడూరు, మన న్యూస్ :- గూడూరు మండలం చెన్నూరు గ్రామానికి చెందిన రామ తేజ శ్రీకాళహస్తికి చెందిన సాయి దీపికలు ప్రేమ వివాహం చేసుకున్నారు. వారి వివాహాన్ని పెద్దలు అంగీకరించకపోవడంతో వారు గూడూరు రూరల్ పోలీసులను ఆశ్రయించి తమకు రక్షణ కల్పించాలని కోరారు. వీరిద్దరూ గూడూరు లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్నారు. వీరిది కులాంతర వివాహం కావడంతో తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న పెద్దల అంగీకారం లేకపోవడంతో తమకు ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని తమకు తమ కుటుంబ సభ్యుల నుండి రక్షణ కల్పించాలని వారు పోలీసులను వేడుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *