శంఖవరం మనన్యూస్ ప్రతినిధి (అపురూప్):- కాకినాడ జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు మాజీమంత్రి దాడిశెట్టి రాజాను రాజా నివాసంలో మాజీమంత్రి పీఏసీ సభ్యులు ముద్రగడ పద్మనాభం, ప్రత్తిపాడు నియోజకవర్గ వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో మళ్లీ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డిని చేయడమే లక్ష్యంగా కృషి చేయాలని రాజా తో ముద్రగడ ఆకాంక్షించారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని నియోజకవర్గంలో, మండలాల్లో, గ్రామాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు గిరిబాబు రాజాకు వివరించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్న విధివిధానాలను ప్రజలకు వివరించేలా త్వరలోనే కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తామని గిరిబాబు వివరించారు. ఈ కార్యక్రమంలో నరిసే శివాజీ , గౌతు స్వామి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *