

గూడూరు, మన న్యూస్ :- స్థానిక ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఇటీవల షార్టటర్మ్ ఇంటర్న్షిప్ విజయవంతంగా పూర్తి చేసుకున్న విద్యార్థిని విద్యార్థులకు సంబంధిత సర్టిఫికెట్స్ ప్రదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే. శివ ప్రసాద్ మాట్లాడుతూ బిఏ విద్యార్థులు రొటీన్ కి భిన్నంగా ఫైన్ ఆర్ట్స్ లో ఇంటర్న్షిప్ చేయడం తద్వారా చిత్రలేఖనం లో మెళుకువలు తెలుసుకోవడం వారి సబ్జెక్టులో వివిధ అంశాలను బొమ్మల రూపంలో వ్యక్తపరచడం ఒక కళాత్మక ప్రతిభను పెంపొందించుకోవడం జరిగిందన్నారు. విద్యార్థిని విద్యార్థులను అభినందించారు. అదేవిధంగా చరిత్ర అధ్యాపకులు డాక్టర్ గోవింద సురేంద్ర మాట్లాడుతూ చిత్రం లేఖనంలో ఆసక్తి కనబరిచిన విద్యార్థులు చారిత్రక అంశాల విశ్లేషణలో ప్రతిభ చూపుతారని ఈ అవకాశం కల్పించిన సప్తవర్ణ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ హైదరాబాద్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ మరియు ఇంటర్న్షిప్ కోఆర్డినేటర్ డాక్టరు వై. శ్రీనివాసులు, అధ్యాపకులు డాక్టర్ బి. పీర్ కుమార్, డాక్టర్ కోటేశ్వరరావు, కిరణ్మయి, డాక్టర్ శైలజ, డాక్టర్ ఝాన్సీ వాణి, కృపా కరుణ వాణి, భీమవరపు లక్ష్మి, మైమూన్, రవి రాజు, గోపాల్, జనార్ధన్, శైలజ, సుందరమ్మ తదితర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
