తవణంపల్లి, జులై 2 మనద్యాస (నాగరాజ సరకింటి )
మండలంలోని దిగువమాఘం గ్రామం బహుదా నది ఒడ్డున వెలసిన శ్రీ ద్రౌపతి సమేత ధర్మరాజుల వారి దేవస్థానంలో మహాభారత యజ్ఞం శుక్రవారం నుండి ప్రారంభం అవుతుందని ఆలయ ధర్మకర్త ఆర్. ఉమాపతిరెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం గరిగోత్సవం, అఖిలాండ ప్రదానం, ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే మహాభారత యజ్ఞం ఈ నెల 27వ తేదీన జరిగే ధర్మరాజుల పట్టాభిషేకంతో ఘనంగా ముగుస్తుందన్నారు. ఈ సందర్భంగా ప్రతి రోజు పగలు సి. గీతావాణి భగవాతారిణిచే హరికథలు, క్రిష్ణగిరి ఆసిరియర్ పరమశివన్, తిరపత్తూరు తమిళ అరసు శ్రీ విష్ణుగోకుల కన్నన్ నాటక సభై వారిచే రాత్రి వీధి నాటకంలు ప్రదర్శించబడుతుందని ధర్మకర్త ఉమాపతిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని మహాభారత యజ్ఞంను విజయవంతం చేయాలని ఆయన కోరారు.