మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం ఆరిలోవ జూన్28: విశాఖలో ఆరులోవలో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ ప్రెసిడెంట్ సిద్ధ సూర్యప్రకాశరావు,డిస్ట్రిక్ట్ జాయింట్ ట్రెజరర్ గోల్డెన్ స్టార్ & అమ్మ వాసవి సేవా ట్రస్ట్ చైర్మన్ కె.సి.జి.ఎఫ్ వరదా కృష్ణ,మర్యాదపూర్వకంగా ఆరిలోవ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కలవడం జరిగింది. ప్రెసిడెంట్ సిద్ధ సూర్య ప్రకాశరావు మాట్లాడుతూ అమ్మ వాసవి సేవా నిరుపేద వాసవి సభ్యులకు మీరు అందిస్తున్న సేవా కార్యక్రమాలు చాల బాగుందని తెలిపారు.ఈ యొక్క కార్యక్రమాలను ముందుండి బాగా నడుపుతున్న చైర్మన్ వరధాకృష్ణ ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని ఆయనకి ఆ అమావాస్యవి ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో చేబోల్ శ్రీనివాస్ వరదా కామేశ్వరరావు,కేసారపు సుబ్బారావు, పాల్గొన్నారు.