అందని ద్రాక్షగా మారిన చదువులు

మన న్యూస్ నారాయణ పేట జిల్లా :

అమ్మకానికి పెట్టిన యాజమాన్యాలు.

కమిషన్ ఏజంట్లు గా విద్యాధికారులు.

చదువుల్లో లేని శ్రద్ధ ఫీజు ల వసూల్లో ఎందుకు?.ఉత్తీర్ణత పై పోటీ పడే విద్యాసంస్థలు ఇప్పుడు ఫీజు,పుస్తకాలు,యూనిఫామ్ అమ్మకం లో పోటీ పడుతున్నాయి.

అభివృద్ధి పేరుతో నిలువు దోపిడీ చేస్తున్న స్కూల్ యాజమాన్యాలు.

డీ ఈ ఓ ను బెదిరించి ఉచిత విద్యకు లెటర్ తెప్పించుకున్న జర్నలిస్టులు- ఒక స్కూల్ హెడ్ మాస్టర్.

రిపోర్టర్ పిల్లలకు ఉచిత అడ్మిషన్ ఇస్తాం కానీ చదువు ఎలా ఉంది అని అడగకండి.

నారాయణపేట లో విద్యా సంస్థల కొత్త దందా. వీరికి అండగా విద్యాశాఖ అధికారులు. ప్రతి సంవత్సరం పెరుగుతున్న ఫీజులు. మారుతున్న సమాజం లో తమలాగా పిల్లలు కూడా మిగిలిపోవద్దు అనే ఆలోచన తో ఇబ్బందులు పడుతూ పిల్లల్ని కష్టపడి చదివిస్తున్న తల్లిదండ్రుల నమ్మకం పై బేరాలు. ప్రశ్నిస్తే స్కూల్ లో అడ్మిషన్ ఉండదు.చదువుల కన్నా ఫీజులే ముఖ్యం. బోధించే ఉపాధ్యాయుల పేరు చెప్పి ఎక్కువ వసూళ్లు. అవి సరిపోవడం లేదు అని స్కూల్ పక్కనే బుక్ స్టాల్ ఓపెన్ చేసి పుస్తకాలు యూనిఫామ్ బెల్ట్ లు అమ్ముతున్నారు. కేవలం 5 వ తరగతి వరకు మాత్రమే అమ్ముకోవచ్చు అని ప్రభుత్వం చెబితే అ మాట పెడచేవిన పెట్టి 10 వ తరగతి వరకు అన్ని పుస్తకాలు అమ్ముతున్నారు. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాల వద్ద అని భయపెట్టి మరి ఎల్కేజీ యూకేజీ పిల్లలకు కూడా 2600 రూపాయల పుస్తకాలు అంటగడుతున్నారు. ఇప్పుడే మాటలు నేర్చుకుంటే పిల్లాడికి ఎందుకు అంత ఖర్చు తో కూడిన పుస్తకాలు. పోటీ ప్రపంచంలో 1 వ తరగతి నుండే పోటీ పడాలా. బోధించే ఉపాధ్యాయుడు మాత్రం BED టెట్ అని అప్పుడు కష్టపడాలి,పిల్లలకు ఇప్పటి నుండేనా. ఒక స్కూల్ హెడ్ మాస్టర్ అంటున్నాడు మనం చదువుకున్న చదువు చదువే కాదు అని ? అలాంటప్పుడు నిన్నెలా ఉపాధ్యాయుణ్ణి చేశారు. నువ్వు చదువుకున్న చదువు చదువే కానప్పుడు ఏ అర్హత తో కుర్చీలో కూర్చున్నావు. కేవలం ఫీజు కోసం. ఐడి కార్డ్ లేకుంటే విద్యార్థి అనరు అని కంపల్సరీ అని వాటికోసం బయట నిలబెట్టకుండా ఉండాలి అంటే కొనాలి అని పేరెంట్స్ పై ఒత్తిడి. మాకు చదువు చాలు ఎక్స్ట్రా యాక్టివిటీస్ వద్దు అంటే ఇక్కడ సీటు లేదు అంటున్నారు. రిపోర్టర్ పిల్లలకు ఉచిత చదువులపై వ్యంగంగా మాట్లాడే యాజమాన్యాలు. విద్యాధికారి ని బెదిరించి లెటర్ చేర్చుకుంటారు అని నిందలు వేస్తున్నారు. ఒకవేళ స్కూల్ లో ప్రవేశం ఉన్న చదువు ఎలా ఏంది అని అడగొద్దు అంటున్న సిబ్బంది.అర్హత లేని వాడు స్కూల్ యాజమాన్యం అయితే ఇలాగే ఉంటుంది పరిస్థితి. లంచాలకు అలవాటు పడిన అధికారులు ఇలాంటి వారికి పర్మిషన్ ఇచ్చి భావితరం భవిషత్తు లో ఆటలు ఆడుకుంటున్నారు. ఇలాంటి నీచుల మధ్య పిల్లలు ఎలా మెరుగు పడతారు. ఇలాంటి అమ్మకపు విద్యా మధ్య ఊరు ఏం అభివృద్ధి చెందుతుంది. డెవలప్ మెంట్ పేరుతో మోసాలు చేసే మోసగాళ్ల చేతిలో ఎంతో అపురూపంగా పెంచుకున్న పిల్లల భవిషత్తు పెడుతున్నాం. ఇంటర్ డిగ్రీ ఉన్న వారిచే పాఠాలు బోధిస్తున్నారు. మహా అంటే బీ,ఏ,డ్ అంతే. అంతకన్నా ఎక్కువ చదువుకుని ఉంటే లక్ష రూపాయలు ఇవ్వాలి నెలకు అని పేరెంట్స్ తో అధిక వసూళ్ళు. ఎప్పడు మారుతుంది ఈ సమాజం. పిల్లలకు నాణ్యత విద్యా పేరుతో టార్చర్ పెడుతున్న విద్యా సంస్థలు. పిల్లల బరువు కంటే ఎక్కువ బరువు ఉన్న పుస్తకాలు. చదువు భారంగా మారిన వ్యవస్థ. చదివించలేక పిలలని కూలి పనులకు పంపిస్తున్న తల్లితండ్రులు. దీనంతటికీ ముఖ్య కారణం ప్రభుత్వం. ఇలాంటి ప్రైవేట్ పాఠశాలల అనుమతులు రద్దు చేసి ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తే రాష్ట్రం ఎంతగానో మెరుగుపడుతుంది. ఒక రాష్ట్రం అభివృద్ధి అక్కడ ఉన్న భూముల వల్ల నో లేక పెద్ద పెద్ద భవనాల వల్లనో కాదు చదువుకున్న విద్యావంతుల వల్ల. రాబోయే కాలం లో విద్యా అందని ద్రాక్ష గా మారే అవకాశం. కూలీలుగా మిగిలిపోయే పరిస్థితులు. ఇలాంటి రోజులు రాకుండా ఉండాలంటే ప్రభుత్వం విద్యను ప్రభుత్వ పరం చేయాలి. ప్రైవేటీకరణ రద్దు చేయలని పేటెంట్స్ కోరుతున్నారు. కనీసం ఇప్పుడైనా జిల్లా అధికార యంత్రాంగం వీరిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Related Posts

హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు