ఉప్పల్. మన న్యూస్
నేను బండారి లక్ష్మా రెడ్డి , ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులను ఆహ చెర్లపల్లి రైల్వే టర్మినల్ ప్రారంభమైన తర్వాత అక్కడి మౌలిక వసతులపై పెరుగుతున్న భారం, అలాగే రాబోయే రోజుల్లో పెద్ద సంఖ్యలో మల్టిపుల్ రైళ్లు చర్లపల్లి టెర్మినల్ లో ఆగే అవకాశం ఉన్న నేపథ్యంలో, మౌలిక వసతులైన రహదారులు లైటింగ్ ల ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలను తెలియజేయడం కోసం.
ప్రస్తుతం చెర్లపల్లికి వచ్చే రైళ్లు పెద్ద సంఖ్యలో ప్రారంభమవుతున్నాయి. అయితే, ఉన్న రోడ్డు వ్యవస్థ అదనపు రాకపోకల భారం మోసే స్థితి లేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎమ్మెల్యేగా నేను సకాలంలో తగిన నిధులను మంజూరు చేయించేందుకు కృషి చేస్తున్నాను. ముఖ్యంగా, చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి పలు ప్రధాన రూట్లకు రోడ్ల విస్తరణ, వీధిదీపాల ఏర్పాటును ప్రణాళికలో పెట్టాము.
ప్రధానంగా చేపట్టే పనులు
చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి వివిధ ప్రాంతాలనుండి రోడ్ విస్తరణ లైటింగ్ పనులు:
రైల్వే స్టేషన్హె నుండి చ్ సి ఎల్ జంక్షన్ వరకు
చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి రాంపల్లీ మీదుగా ఘట్కేసర్ వరకు
చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి చంగిచెర్ల మీదుగా వరంగల్ హైవే వరకు
చక్రిపురం నుండి గణేష్ కమాన్ వరకు చెర్లపల్లి జైలు, ఐడీఏ ఫేజ్ 1 & 2 మీదుగా
చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి మల్లాపురం, నోమా జంక్షన్ వరకు
ఈ అన్ని పనుల అంచనా వ్యయం రూ.120 కోట్లు, వీటిని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో పరిశీలిస్తోంది. రైలు సేవలు ఇప్పటికే ప్రారంభమైనందున, వీటిని త్వరితగతిన అమలు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాము.
దీనితో పాటు, చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ పరిసర కాలనీలకు తాగునీరు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాను.
అలాగే టార్మీనల్ చుట్టూ వున్న పరిశ్రమలకు మరియు ఆయిల్ కంపెనీలకు నిత్యం పెద్ద సంఖ్యలో లారీలు, ఇతర వాహనాలు వస్తుంటాయి. వీటికి పార్కింగ్ ప్రధాన సమస్యగా మారింది. ముఖ్యంగా ఆయిల్ కంపెనీల వాహనాలను వారు రోడ్స్ పైన కాకుండా ఒక ప్రత్యేక పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేసుకునేవిధంగా కృషి చేస్తాను.
అదనంగా, చెర్లపల్లి జైలు శాఖ, చెర్లపల్లి ఇండస్ట్రియల్ అసోసియేషన్, స్థానిక పారిశ్రామికవేత్తలతో కలిసి పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పి పి పి) మోడల్‌లో జైలు ఖాళీ భూభాగాన్ని వినియోగించి కన్వెన్షన్ సెంటర్, వర్కింగ్ వుమెన్స్, మెన్స్ హాస్టల్స్, సబ్సిడైజ్డ్ ఇండస్ట్రియల్ కాంటీన్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాను. దీనికోసం చెర్లపల్లి పరిశ్రమల నుండి సి ఎస్ ఆర్ నిధులు పొందేలా చూస్తాను.
చివరగా, చెర్లపల్లి మరియు పరిసర ప్రాంతాల అభివృద్ధి నా హృదయానికి అత్యంత దగ్గర. ప్రజల సౌకర్యం కోసం అవసరమైన ప్రతీ చర్య తీసుకుంటానని హామీ ఇస్తున్నాను అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *