ప్రభుత్వ పాఠశాలలు బలోపేతానికి పటిష్ట చర్యలు.. రాష్ట్ర విద్యా కమిషన్ మెంబర్ డాక్టర్ చారకొండ వెంకటేష్

చైతన్యపురి , మన న్యూస్ :– రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తమ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర విద్యా కమిషన్ మెంబర్ డాక్టర్ చారకొండ వెంకటేష్ అన్నారు. శనివారం సరూర్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. రికార్డులు తనిఖీ చేసారు. విద్యార్థులతో ముచ్చటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన ఉపాధ్యాయులతో మాట్లాడారు. విద్య నాణ్యత ప్రమాణాలు పెంపొందించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో లభించే సౌకర్యాలపై ప్రజలకు వివరించాలన్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించి పాఠశాల ఆవరణను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని సూచించారు. గురుకుల పాఠశాలలకు దీటుగా తమ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తుందన్నారు. నాణ్యమైన విద్య అందించడం కోసం తమ ప్రభుత్వం ఎంత ఖర్చయినా భరించడానికి సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కోసం ఉచిత పాఠ్యపుస్తకాలు, దుస్తులు అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదివి అత్యున్నత మార్కులు సాధించి ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సారధ్యంలో ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలకు దూరంగా ఉండాలని తద్వారా ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని కోరారు. నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలలోనే లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు కవిత, ఉపాధ్యాయులు మధుసూదన్, శేఖర్ రెడ్డి, నారాయణ, బాలనరేందర్, వెంకటేష్, పద్మ, రోజారమణి, మరియమ్మ, విజయశ్రీ, శోభారాణి, లలిత, భాగ్యమ్మ, రాధ, స్వర్ణలత, అరుణ, డాక్టర్ రామచంద్రుడు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 5 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///