చిరుధాన్యాల సాగు విస్తీర్ణం పెంచాలి – వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు

మన న్యూస్ పాచిపెంట జూన్ 24:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో రైతులు చిరుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని పెంచాలని ప్రభుత్వం చోడి పంటకు మంచి మద్దతు ధర ప్రకటించిందని రైతులు దళారులను నమ్మి పంటలు వేయొద్దని గొట్టూరు సర్పంచ్ మాదల సింహాచలం అన్నారు గొట్టూరు రైతు సేవా కేంద్రంలో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో మాట్లాడుతూ రైతులు మొక్కజొన్న పంట వైపు మళ్లుతున్నారని నీటి సదుపాయం లేని మొక్కజొన్న ఆర్థికంగా లాభదాయకంగా ఉండదని దాని స్థానంలో ఎలాంటి ఖర్చులు లేని చిరుధాన్యాలను సాగు చేసుకోవాలని కోరారు రైతులు ఒకే పంట కాకుండా పలు పంటలు వేసుకోవాలని గట్లు మీద పండ్ల మొక్కలు కూరగాయలు సాగు చేసుకోవాలని అంతర పంటలు అభివృద్ధి చేసుకోవడం ద్వారా అదనపు ఆదాయం వస్తుందని ప్రకృతి సేద్య పంటలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉందని కాబట్టి రైతులు ప్రకృతి సేద్యం దిశగా మల్లాలని కోరారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు మాట్లాడుతూ ప్రభుత్వం గిరిజన రైతులకు 90% రాయితీపై విత్తనాలు అందిస్తుందని అలాగే కంది పంట చిరు సంచులను ఉచితంగా అందజేస్తుందని కావలసిన రైతులు రైతు సేవా కేంద్రాల్లో పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు అనంతరం రైతులు మాట్లాడుతూ 20 మంది వరకు పిఎం కిసాన్ లబ్ధిదారులకు లబ్ధి చేకూరలేదని అలాగే ఈ సంవత్సరం ఉలవ పంటకు మద్దతు ధర తో కొనుగోలు చేపట్టాలని ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గ్రామ పెద్దలు గ్రామ వ్యవసాయ సహాయకులు భారతి కిరణ్ ప్రకృతి సేద్య ఉద్యోగులు సురేష్ అప్పన్న మరియు రైతులు పాల్గొన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..