గంగాధర్ నెల్లూరు ఎస్ఆర్ పురం మండలాల్లో సుడిగాలి పర్యటన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ థామస్

ఎస్ఆర్ పురం, మన న్యూస్…గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు స్థల పరిశీలనకు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ సుడిగాలి పర్యటన చేశారు ఆదివారం సాయంత్రం
చిత్తూరు తర్చూరు జాతీయ రహదారి , పరిధిలోగంగాధర్ నెల్లూరు మండలం బాలగంగనపల్లి, పద్మాపురం , ఎస్ఆర్ పురం రెవిన్యూలో పాతపాలెం దాసరిగుంట, సింధూ రాజపురం భూములను పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ థామస్
ఎస్ఆర్ పురం రెవెన్యూలో పరిశ్రమల ఏర్పాటుకు అన్ని బాగున్నాయి..
ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటుకు రైతులు భూములు ఇవ్వడానికి స్వచ్ఛందంగా ముందుకు రావడం ఎంతో శుభ పరిణామం.. అని ఎమ్మెల్యే డాక్టర్ థామస్ తెలిపారు ఎస్ఆర్ పురం పరిధిలో రెండు పరిశ్రమలు బయోటెక్ పరిశ్రమ పాలీహౌస్ పరిశ్రమ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించాం
ఈ రెండు పరిశ్రమలకు ఏర్పాటుకు స్థలాలు అనుకూలంగా ఉన్నాయి ..
త్వరలో పరిశ్రమలకు సంబంధించిన టీం స్థలాన్ని పరిశీలిస్తారని ఎమ్మెల్యే డాక్టర్ థామస్ తెలిపారు..గొల్లపల్లి సుబ్రహ్మణ్యం నాయుడు అనే రైతు మాట్లాడుతూ
మా గ్రామంలో పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి మా చుట్టుపక్కల గ్రామీణ ప్రజలు అభివృద్ధి చెందుతారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ప్రభుత్వ సలహాదారుడు చంద్ర, సర్వేర్ సునీత సాఫ్ట్వేర్ బాలు నియోజకవర్గ ఎస్సీ సెల్ కార్యదర్శి కుమార్ మాజీ సర్పంచ్ కుప్పయ్య, ఆర్టిఐ జిల్లా అధ్యక్షుడు జయరాజ్ బాలాజీ నాయుడు సుబ్రహ్మణ్యం నాయుడు సతీష్, గుర్రప్ప నాయుడు భాస్కర్ నాయుడు రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *