యోగ తోనే సంపూర్ణ ఆరోగ్యంయోగా ద్వారా పని బత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 21:- జోగుళాంబ గద్వాల జిల్లా గద్వాల జిల్లా పోలీస్, యోగ తోనే సంపూర్ణ ఆరోగ్యం, ఒత్తిడి నుండి ప్రశాంతత, ఆనందమాయమైన జీవనం కొనసాగించడానికి యోగానే ఔషదం. ప్రతి ఒక్కరు యోగాను నిజ జీవితంలో అలవాటుగా మార్చుకోవాలి, జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్
అంతర్ జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్ నందు యోగా కార్యక్రమాలు నిర్వహణ.

యోగా ద్వారా పని ఒత్తిడి నుండి ఉపశమనం కలగడం తో పాటు సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని, ఆనందమాయమైన జీవితానికి ప్రతి ఒక్కరు యోగాను నిజ జీవితంలో అలవాటుగా మార్చుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్ అన్నారు. 11 అంతర్జాతీయ యోగా దినోత్సవం ను పురస్కరించుకొని జిల్లా పోలీస్ శాఖ ఆద్వర్యంలో పతాంజలి యోగా వారి సహకారం తో జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్ నందు యోగా కార్యక్రమాలు నిర్వహించడం. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పి పాల్గొని యోగా చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉంటూ ఆనందమైన జీవితానికి యోగా ఉపయోగపడుతుందని, వేల సంవత్సరాల నుండి యోగా భారత దేశ సంస్కృతిలో బాగంగా ఉండడం మనకు దక్కిన గొప్ప గౌరవం అని, ప్రపంచ దేశాలు యోగా ప్రాముఖ్యతను తెలుసుకొని ప్రత్యేక గుర్తింపును ఇచ్చాయని అన్నారు. చేసే పని పై శ్రద్ధ పెరుగుటకు,
మనసు ప్రశాంతంగా ఉంచుకొనుటకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని , ఎప్పుడూ పని ఒత్తిడిలో ఉండే వారికి యోగా అంతో ఉపయోగపడుతుందని, ప్రతి ఒక్కరు యోగాను నిజ జీవితంలో ఒక అలవాటుగా మార్చుకోవాలని అన్నారు. కుటుంబాలకు, చిన్న పిల్లలకు డబ్బును కాకుండా యోగాను అందిస్తే సంపూర్ణ ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని అన్నారు.
ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా ట్రైనర్స్ పోలీసు అధికారులు, సిబ్బందితో యోగా ఆసనాలు, ధ్యానం, శ్వాస పైన ధ్యాస, సూర్య నమస్కారాలు, ప్రాణాయామము, తదితర ఆసనాలు చేయించడం జరిగిందనీ తెలియజేస్తూ జిల్లా ప్రజలకు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జూన్ 26 మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని, రాష్ట్ర వ్యాప్తంగా వారం పాటు నిర్వహించునున్న వారోత్సవాలను విజయవంతం చేయాలని, ప్రతి ఒక్కరూ డ్రగ్ రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని, యువతని అటు వైపు వెళ్లకుండా చైతన్యం చెయ్యాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డి . ఎస్పీ శ్రీ వై మొగిలయ్య, సాయుధ దళ డి.ఎస్పీ నరేందర్ రావు, కార్యాలయ ఏ.ఓ సతీష్ కుమార్, ఎస్బి. ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రెడ్డి, గద్వాల్, ఆలంపూర్, శాంతి నగర్ సి ఐ లు టంగుటూరు శ్రీను, రవి బాబు, టాటా బాబు, అర్ ఐ వెంకటేష్, జిల్లా లోని అన్ని పోలీస్ స్టేషన్ ల, విభాగాల ఎస్సై లు, 280 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related Posts

ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు.పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలో జరిగిన పోషణ మాసం మహోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం…

పేదోడి సొంతింటి కల నెరవేరింది..

మనధ్యాస,నిజాంసాగర్(జుక్కల్): సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుతో పేదోడి సొంతింటి కల నిజమవుతుందని నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ అన్నారు. సోమవారం సుల్తాన్ నగర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటికి ప్రారంభోత్సవం నిర్వహించారు.ఇందిరమ్మ పథకం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

  • By RAHEEM
  • October 28, 2025
  • 5 views
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

  • By RAHEEM
  • October 28, 2025
  • 5 views
ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?