ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరులో జాగ్రత్తలు పాటించాలి నకిలీవిత్తన వ్యాపారాలు వద్ద విత్తనాలు కొనుగోలు చేయొద్దు విజలెన్స్ మోనటరింగ్ కమిటీ సభ్యులు మణికుమార్ హెచ్చరిక

మన న్యూస్ పాచిపెంట జూన్ 17: ఎస్ టి కులాల ధ్రువీకరణ పత్రాలు మంజూరు విషయంలో రెవెన్యూ శాఖ అధికారులు తగు జాగ్రత్తలు పాటించాలని, అలాగే రైతులు మొక్కజొన్న, పత్తి విత్తనాలు కొనుగోలు విషయంలో నకిలీ వ్యాపారులను నమ్మొద్దని, వారి దగ్గర కొనుగోలు చేయవద్దని, షాపుల్లో విత్తనాలు విక్రయించే వ్యాపారులు వద్ద కొనుగోలు చేస్తే వారి దగ్గర బిల్లులు తీసుకోవాలని విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు జే మణికుమార్ కోరారు. మంగళవారం నాడు ఆయన పత్రికా విలేకరులకు ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాచిపెంట మండలంలో ఎస్టీ కుల దృవీకరణ పత్రాలు మంజూరు విషయంలో రెవెన్యూ శాఖ జాగ్రత్తలు పాటించి అవసరమైతే దరఖాస్తుదారుని ఇంటికి వెళ్లి నాలుగు తరాలు కుటుంబం గురించి ఆరా తీసి గ్రామస్తులు వాంగ్మూలం తీసుకొని కుల ధ్రువీకరణ పత్రం మంజూరు చేయాలని కోరారు. గతంలో చాలామంది నకిలీ కుల దృవీకరణ పత్రాలు తో చలా మణి అవుతున్నారని వారిపై కోర్టులో కేసులు నడుస్తున్నాయని అందుచేత రెవెన్యూ శాఖ తగు జాగ్రత్తలు పాటించి కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని కోరారు.నకిలీ విత్తనాలు తో రైతులు జాగ్రత్త :- అమాయకపు రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని,రైతులు మొక్కజొన్న,పత్తి విత్తనాలు కొనుగోలు విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని లైసెన్స్ ఉన్న షాపుల్లో విత్తనాలు కొనుగోలు చేయాలని జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు జే మణికుమార్ రైతులను కోరారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ కారణంగా చాలామంది నకిలీ వ్యాపారులు నకిలీ విత్తనాలు విక్రయాలు జరుపుతారని అటువంటి వారి పట్ల జాగ్రత్తలు వహించి బిల్లులు ఇచ్చే షాపుల్లో విత్తనాలు కొనుగోలు చేయాలని కోరారు. లైసెన్స్ పొందిన దుకాణాల్లో విత్తనాలు కొనుగోలు చేసినట్లయితే ఇన్సూరెన్స్ ఉంటుందని, నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దని రైతులకు ఆయన హితవు పలికారు.పంట ఎక్కువ దిగుబడి వస్తుందని సీడ్స్ వ్యాపారస్తులు రైతులను మోసం చేయడం అలవాటుగా మారిందని అటువంటి మారి మాటలు నమ్మి మోసపోవద్దని రైతులను ఆయన కోరారు. అటువంటి వారిపై వ్యవసాయ శాఖ అధికారులు దృష్టి సారించి ఎటువంటి నష్టం జరగకుండా చూడాలని కోరారు.

Related Posts

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

  • By JALAIAH
  • October 29, 2025
  • 4 views
సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!