రైతు సాగుకు సమాయత్వం అవుతున్న పంట కాలవల్లో పూడికలు తీయని వైనం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్::రుతుపవనాలు జోరందుకున్నాయి. విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.రైతులు ఏరువాక పౌర్ణమి నిర్వహించుకుని సాగుకు సమాయత్తమయ్యారు.కానీ రైతుకు సాగునీరు ఇవ్వాల్సిన అధికారులు,నిర్లక్ష్యం వహిస్తున్నారు.స్థానిక ప్రజా ప్రతినిధులు తమకు పట్టినట్లుగా ఊరుకున్నారు.దీంతో ప్రతి ఏటా ఏప్రిల్ ,మే నెలల్లో పంట కాలువల్లో పూడికలు తొలగించి,సాగునీరు రైతుకు అందేలా అధికారులు సమాయత్తం అవ్వాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు పూడికతీత పనులు జూన్ పక్షం రోజుల దాటిన పూడికతీత పనులు చేపట్టలేదు. మరి రైతుకు సాగునీరు ఎట్లా అందుతుందో అధికారులు,ప్రజా ప్రతినిధులే సమాధానం చెప్పాలి. మునుపెన్నడూ లేని విధంగా రైతులు పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని, రైతాంగం ఆరోపిస్తుంది. ఇప్పటికీ నీటి యజమాన్య సంఘాలు,ఏలేరు నీటి సంఘాలు,తిమ్మరాజు చెరువు నీటి సంఘాలు కమిటీలు ఉత్సవ విగ్రహాల ఉన్నారు. రైతాంగానికి వారు ఇప్పటివరకు చేసిందేమీ లేదు. పంట కాలువల్లో పూడికలు తీయకపోవడం వల్ల,తుప్పలతో కాలువలు మూసి వేయబడ్డాయి. కొన్నిచోట్ల వ్యాపారస్తుల కంపోస్ట్ యాడ్లుగా బాగా పనికొస్తున్నాయి.కొన్నిచోట్ల వంటకాలు ఆక్రమణలకు గురయ్యాయి. దీంతో అధికారులు పూడికతీతలు తీసేందుకు అవకాశం లేదని పంటకాలంలో ఆక్రమణ గురయ్యాయని, కొన్నిచోట్ల పంట కాలువలను ఆక్రమించి ఇల్లు కట్టుకున్నారని, మరికొన్నిచోట్ల పంట కాలువ వెడల్పు తగ్గించి, నీరు ప్రవహించడానికి వీలు లేకుండా మురుకు కాలువలుగా మార్చేశారని అధికారులు వాపోతున్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *