10 నెలల నుంచి బాధితులకు తీవ్ర వేధింపులు.. తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఉదయం నుంచి గద్వాలలోని ఉప్పల్ విజయ్ రెడ్డి ఇంటిముందు బైఠాయించిన బాధితులు.

పొలానికి వెళ్తున్న వ్యక్తిని బొలెరో వాహనం బలంగా ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడిన వ్యక్తి.కేసును వెనక్కి తీసుకోవాలంటూ ఉప్పల్ విజయ్ రెడ్డి హుకుం జారీ

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 16:-జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని ఆరగిద్ద గ్రామానికి చెందిన చిన్న హనుమంతు 10 నెలల కిందట వ్యవసాయ పొలానికి వెళ్తున్న సందర్భంలో ఉప్పల్ విజయ్ రెడ్డి బొలెరో వాహనం ఎదురుగా వచ్చి బలంగా ఢీకొట్టడంతో ఆయనకు ఒక కాలు,చెయ్యి రెండు చోట్ల విరగగా, తీవ్రంగా గాయపడగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. గాయపరిచిన వాహన యజమాని ఉప్పల్ విజయ రెడ్డి మీకు కావాల్సిన ఆస్పత్రికి అయ్యే ఖర్చులు 10లక్షల వరకు నేనే భరిస్తానని నాపై కేసు పెట్టొద్దని చెప్పగా బాధితులు అప్పటికి ఆలోచన చేసి సరే అని బదులిచ్చారు. అయితే ఉప్పల్ విజయ రెడ్డి అప్పటికప్పుడు లక్ష రూపాయలు ఫోన్ పే ద్వారా చెల్లించగా, మిగతా డబ్బులు తర్వాత ఇస్తానని నమ్మబలికారు. అయితే దినం గడిచిన కొద్దీ వారిని ఇబ్బందులకు గురిచేస్తూ మిగతా డబ్బులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు.అప్పటినుంచి బాధితులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తూ మూడుసార్లు పెద్ద సమక్షంలో పంచాయతీలు పెట్టిన బాధితులకు ఎలాంటి న్యాయం జరగకపోగా ఈరోజు గద్వాలలో బాధితులు కుటుంబ సభ్యులతో కలిసి ఉప్పల్ విజయ రెడ్డి ఇంటి ముందు బైఠాయించారు.రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నా భర్తకు మతిస్థిమితం తప్పిందని, మా కుటుంబం రోడ్డున పడిందని, మాకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ బాధితులు చిన్న హనుమంతు భార్య ఓబులమ్మ తేల్చి చెబుతున్నారు.

Related Posts

ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ). జిల్లా కేంద్రానికి సరిహద్దుల్లో ఉన్న పత్తి మిల్లులను, సరిహద్దులోని చెక్ పోస్టులను అదనపు కలెక్టర్ వి. విక్టర్ పరిశీలించారు.మద్నూర్ మండలంలోని మంగళవారం అంతరాష్ట్ర సరిహద్దు వద్ద ఏర్పాటుచేసిన చెకో పోస్టును తనిఖీచేశారు.చెక్ పోస్టు సిబ్బందికి పోలీసులకు…

రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మద్నూర్ తహసీల్దార్ కార్యాలయంలో జుక్కల్ నియోజకవర్గ ఈఆర్ వో (ఓటరు నమోదు అధికారి), జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

  • By JALAIAH
  • October 29, 2025
  • 4 views
సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!