గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 16:- జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం పులికల్ గ్రామంలో యథేచ్ఛగా మట్టి రవాణా. ఎక్కడైనా మట్టి కనిపించిందా తవ్వేయ్‌.. అమ్మేయ్‌.. ఇది ప్రస్తుతం గ్రామాల దందా.. అక్రమార్కులు ఎక్కడా మట్టి గుట్ట కనపడనివ్వడం లేదు.. అధికారుల అండదండలతో తవ్వేస్తున్నారు.. యథేచ్ఛగా రవాణా చేసేస్తున్నారు. అయినా ఏ ఒక్కరూ కన్నెత్తి చూడడం లేదు.. కనీస చర్యలు చేపట్టడం లేదు. ట్రాక్టర్ల శబ్దంతో రాత్రి సమయంలో నిద్రరాకపోవడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పులికల్ గ్రామంలో సాగుతున్న మట్టి దందానే దీనికి నిదర్శనం.మట్టి తవ్వుతున్న ఏ విధమైన అనుమతుల్లేకుండా మట్టి తరలిస్తున్నారు. దీని వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడడంతో పాటు పూర్తిగా రోడ్లు ధ్వంసం అవుతున్నాయని గ్రామస్థులుమండిపడుతున్నారు. అంతే కాకుండా వాహనాల వేగానికి ప్రజలు భయపడు తున్నారు. ఇంత జరుగుతున్న రెవెన్యూ,పోలీస్ మైనింగ్‌ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం శోచనీయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *