తిరుపతి రూరల్, మన న్యూస్ : – తిరుపతి రూరల్ మండలంలోని వేదాంతపురం గ్రామ పంచాయతీ పరిధిలోని 250 కాలనీ నడివీధిలో గంగమ్మ తల్లికి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. గ్రామస్థుల భాగస్వామ్యంతో గంగమ్మకు ప్రత్యేక పూజలు, అంబలి కార్యక్రమం వైభవంగా సాగాయి. ఈ సందర్భంగా ఊరు మొత్తం ఉత్సవవాతావరణాన్ని దాల్చింది.స్థానిక సర్పంచ్ శ్రీ జనార్దన్ యాదవ్ గారు గంగమ్మ తల్లికి ‘సారె’ సమర్పించి, ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గ్రామ పెద్దలు, నాయకులు సర్పంచ్‌ను శాలువాతో సత్కరించారు. పూజల సందర్భంగా పెద్ద సంఖ్యలో మహిళలు, పురుషులు, చిన్నారులు పాల్గొన్నారు. భక్తి గీతాలు, అంబలి ప్రదక్షిణలతో వాతావరణం ఆధ్యాత్మికంగా మారింది. గ్రామస్థుల సన్నిహిత సహకారంతో జరిపిన ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధల నడుమ విజయవంతంగా ముగిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *