మన న్యూస్ తవణంపల్లె జూన్-6

పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లె మండలం, ముట్టుకూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతా రాముల వారి దేవస్ధానం మహా కుంభాభిషేకం మహోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్, మరియు పలమనేరు శాసనసభ్యులు యన్.అమరనాధ్ రెడ్డి హాజరయ్యారు. ముట్టుకూరు గ్రామంలోని సీతారాముల ఆలయం వద్దకు చేరుకున్న వీరికి ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలుకగా, మండల నాయకులు దుశ్శాలువతో సత్కరించి, గజమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోని శ్రీ సీతా రాముల వారిని దర్శించి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజలు, సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గోన్నారు. అనంతరం ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం అందించి, స్వామి వారి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ.. “ముట్టుకూరు గ్రామంలో శ్రీ సీతారాముల ఆలయ నిర్మాణంకు సహాయ సహకారాలు అందించిన గ్రామస్తులకు హృదయ పూర్వక అభినందనలు తెలియజేశారు. ఇలాంటి పవిత్ర ఆలయాల నిర్మాణం ఒక్క ఆధ్యాత్మికత కోసమే కాదు, సమాజం ఐక్యతకూ, శాంతికి, సాంస్కృతిక విలువల ప్రేరణకూ మూలస్తంభాల వంటివి” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిఎన్టియూసీ కార్యదర్శి యువరాజుల నాయుడు, రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ చౌదరి, తవణంపల్లె ‌మండల అధ్యక్షులు గాలి దిలీప్ కుమార్ నాయుడు, పూతలపట్టు మండల అధ్యక్షులు దొరబాబు చౌదరి, ఐరాల మండల అధ్యక్షులు గంగారపు హరిబాబు నాయుడు, బంగారుపాళ్యం మండల అధ్యక్షులు ఎన్.పి.ధరణీ నాయుడు, బంగారుపాళ్యం మార్కెట్ కమీటీ ఛైర్మన్ భాస్కర్ నాయుడు, కాణిపాకం మాజీ ఆలయ ఛైర్మెన్ మణినాయుడు, తవణంపల్లె మండల క్లస్టర్ ఇంఛార్జ్ సునీల్ చౌదరి, యాదమరి మండల క్లస్టర్ ఇంఛార్జ్ చిత్రా నాయుడు, ఐరాల మండల జెడ్పీటీసీ సుచిత్ర కన్నయ్య నాయుడు, మాజీ జెడ్పిటీసీ లతా బాబునాయుడు, పూతలపట్టు మాజీ మండల అధ్యక్షులు చంద్రమౌళి, టిడిపి సీనియర్ నాయకులు రఘురాం చౌదరి, ప్రవీణ్ కుమార్ నాయుడు, తవణంపల్లె మండల మహిళ అధ్యక్షురాలు చిట్టెమ్మ, సరకల్లు సర్పంచ్ కత్తి సతీష్ రెడ్డి, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *