సుప‌రిపాల‌న‌కు ఏడాది – జ‌న‌సేన సంబ‌రాలు

మన న్యూస్,తిరుప‌తిః కేంద్రంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ నేతృత్వంలో, రాష్ట్రంలో చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆధ్వ‌ర్యంలో ఏన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వాలు ఏర్పడి ఏడాది అయిన సంద‌ర్భంగా జ‌న‌సేన ఘ‌నంగా వేడ‌క‌లు నిర్వ‌హించింది. ఎస్టీవి న‌గ‌ర్ లోని గంగ‌మ్మ వీధిలో బుధ‌వారం ఉద‌యం ముగ్గుల పోటీలు నిర్వ‌హించింది. ముగ్గుల పోటీని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు, ఆయ‌న స‌తీమ‌ణి స‌త్య‌వ‌తితో క‌లిసి ప‌రిశీలించారు. ఈ పోటీల్లో యాభై మంది పాల్గొన‌గా మొద‌టి బ‌హుమ‌తిని సూజాతా, రెండో బ‌హుమ‌తిని ప్ర‌మీల‌, మూడో బ‌హుమ‌తిని దీప్తి, పూజితాలు సంయుక్తంగా గెలుచుకున్నారు. వీరికి బ‌హుమ‌తుల‌ను ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు అంద‌చేశారు. కాగా సాయంత్రం త‌న నివాసం వ‌ద్ద ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు దీపాలు వెలిగించి ఎన్డీఏ కేక్ క‌ట్ చేసి జ‌న‌సైనికుల‌తో సంతోషాన్ని పాలుపంచుకున్నారు. అనంత‌రం భారీగా బాణా సంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. సుప‌రిపాల‌న‌కు ఏడాదైన సంద‌ర్భంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పిలుపు మేర‌కు సంక్రాంతి, దీపావ‌ళి క‌లిపి వేడుక‌గా చేసుకోవాల‌ని పిలుపు నివ్వ‌డంతో వేడుక‌లు నిర్వ‌హించిన‌ట్లు ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు చెప్పారు. దీపావ‌ళి రోజు న‌ర‌కాసురుడుని వ‌ధించిన‌ట్లు ప్ర‌జ‌లు వైసిపికి ప్ర‌తిప‌క్ష హోదా కూడా ఇవ్వ‌కుండా బుద్ది చెప్పార‌ని ఆయ‌న తెలిపారు. ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌ను ఒక్కొక్క‌టిగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్, యువ నాయ‌కులు మంత్రి లోకేష్ లు నెర‌వేరుస్తూ వ‌స్తున్నార‌ని ఆయ‌న చెప్పారు. అభివృద్ధి, సంక్షేమానికి స‌మ‌పాళ్ళ‌లో ప్రాధాన్య‌త ఇస్తూ ఎన్డీఏ ప్ర‌భుత్వం రాష్ట్రాన్ని పున‌ర్ నిర్మిస్తోంద‌ని ఆయ‌న తెలిపారు. సిగ్గూ,శ‌రం లేకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినోత్స‌వం జ‌రిపిందని ఆయ‌న విమ‌ర్శించారు. ఐదేళ్ళ అరాచ‌క పాల‌న విర‌గడై ఏడాది కావ‌డంతో ప్ర‌జ‌లంతా సంతోషంగా ఉన్నార‌ని ఆయ‌న చెప్పారు. త‌ల్లిని, చెల్లిని దూరం పెట్టి వెన్నుపోటు పొడిచ‌న జ‌గ‌న్ కు వెన్నుపోటు దినోత్స‌వం జ‌రిపే నైతిక‌త లేద‌ని ఆయ‌న అన్నారు. వైసిపి పాల‌న‌లో త‌ప్పు చేసిన నాయ‌కులు, అధికారుల‌కు చ‌ట్ట‌ప్ర‌కారం శిక్ష‌లు త‌ప్ప‌వ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. ఎన్డీఏ కూట‌మి పాల‌న‌లో త‌ప్పుల‌కు అవ‌కాశం లేకుండా చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ లు చూస్తున్నార‌ని ఆయ‌న చ ఎప్పారు. ఈ కార్య‌క్ర‌మాల్లో జ‌న‌సేన నాయ‌కులు రాజారెడ్డి, ఎస్కే బాబు, దూది శివ‌, తిరుత్తుణి వేణు, హ‌రిశంక‌ర్, దినేష్ జైన్, ఆవులపాటి బుజ్జి బాబు,సుభాషిణి, కీర్త‌న‌, ఆకుల వ‌న‌జ‌, ఆర్కాట్ కృష్ణ‌ప్రాస‌ద్, బ‌ల‌రామ్, ప్ర‌భాక‌ర్, సురేష్, య‌శోద‌, శ్రీహ‌రి నాయుడు, య‌శ్వంత్, దుర్గా, వినోద్ రాయ‌ల్, పొటుకూరు ఆనంద్, యువరాజ్ రెడ్డి , ఆముదాల వెంక‌టేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Related Posts

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

  • By NAGARAJU
  • September 12, 2025
  • 3 views
కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

  • By NAGARAJU
  • September 12, 2025
  • 2 views
నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

  • By NAGARAJU
  • September 12, 2025
  • 4 views
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

  • By NAGARAJU
  • September 12, 2025
  • 7 views
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…