పిఠాపురం, Mana News :- సంవత్సర కాలంగా రెడ్ బుక్ పేరుతో పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వం పై పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జి వంగా గీత విశ్వనాథ్ ఆద్వర్యంలో తీవ్ర స్థాయిలో ఆందోళన చేపట్టారు.ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పధకాలతో ఊదర గొట్టిన కూటమి ప్రభుత్వం ప్రజలను నయవంచనకు గురి చేసిందని ధ్వజమెత్తారు.పరిపాలన సరిగా లేదంటే రెడ్ బుక్ పేరుతో కేసులు పెట్టి వేధిస్తున్నారని,సిగ్గులేని కూటమి ప్రభుత్వాన్ని గంగలో కలిపే రోజు దగ్గరలోనే ఉందని అన్నారు.కూటమి ప్రభుత్వం అవినీతి ఆరాచాకలతో పాలన సాగిస్తుండటంతతో మాపార్టి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు వైసీపీ కార్యకర్తలు నాయకులు అభిమానులు గీత నాయకత్వం లో భారీ ఆందోళన కు స్వీకారం చుట్టి రోడ్డెక్కి నిరసన తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ కార్యకర్తలు నాయకులు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *