మన న్యూస్ పుతలపట్టు నియోజకవర్గం జూన్-4

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి అయిన సందర్భంగా పూతలపట్టు నియోజకవర్గం, ‌బంగారుపాళ్యం మండల కేంద్రంలో విజయోత్సవ ర్యాలీ అట్టహాసంగా జరిగింది. విజయోత్సవ ర్యాలీ సందర్భంగా బంగారుపాళ్యంకు చేరుకున్న పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్కి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద గల డాక్టర్ బిఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్ళు అర్పించిన తర్వాత ఎమ్మెల్యే మురళీమోహన్ ఆధ్వర్యంలో ప్రారంభం అయిన విజయోత్సవ ర్యాలీలో వేలాది మంది జనసందోహం నడుమ మేళతాలలతో బాణాసంచా పేలుస్తూ, డ్యాన్స్ లు వేసుకుంటూ ముందుకు సాగింది. పాత ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఉన్న బిపికెఎన్ కాంప్లెక్స్ వద్ద కేకు కట్ చేసిన ఎమ్మెల్యే నాయకులకు, కార్యకర్తలకు తినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ‌మురళీమోహన్ ప్రసంగిస్తూ… శాసనాలను తుంగలో తొక్కి, ప్రజా స్వేచ్ఛను నాశనం చేస్తూ దుర్మార్గంగా, రాక్షసంగా ప్రజలను పట్టి పీడిస్తున్న జగన్ రెడ్డిని ప్రజలు గద్దె దించిన రోజుగా రాష్ట్ర ప్రజలంతా పండుగ చేసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. నరకాసురుడి పాలనను చూపించిన జగన్ రెడ్డి రాక్షస పాలనను విముక్తి కలిగిన రోజుగా జూన్ 4వ తారీఖున ప్రతి‌ ఏడాది ప్రజలు పండుగ రోజుగా జరుపుకుంటాని ఆయన విమర్శించారు. గద్దె దించారని ప్రజలపైనే వెన్నుపోటు రెడ్డి కక్ష చూపుతున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు చూపుతున్న ఆదరణ చూసి ఓర్వలేక వైసీపి డ్రామాలు‌ చేస్తుందని, ఎన్ని డ్రామాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్ధితిలో లేదనే‌ విషయాన్ని జగన్ రెడ్డి గుర్తుంచుకోవాలని తెలిపారు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి, అభివృద్ధిని గాలికి వదిలిన జగన్ రెడ్డికి అతని పార్టీకి ప్రజలు గుడ్ బై చెప్పిన రోజుగా జూన్ 4వ తేదీ రాష్ట్ర ప్రజలకు గుర్తుండి పోతుందన్నారు. చంద్రబాబు నాయుడు అభివృద్ధికి మరో పేరు అయితే జగన్ రెడ్డి అభివృద్ధికి బ్రేకులు వేసిన నాయకుడిగా చరిత్రలో నిలిచి పోతాడని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో బంగారుపాళ్యం మండల అధ్యక్షులు ఎన్.పి ధరణి నాయుడు, మాజీ మండల అధ్యక్షులు ఎన్.పి జయప్రకాష్ నాయుడు, పూతలపట్టు మండల అధ్యక్షులు దొరబాబు చౌదరి, ఐరాల మండల అధ్యక్షులు గంగారపు హరిబాబు నాయుడు,‌ యాదమరి మండల అధ్యక్షులు మురార్జీ యాదవ్, తవణంపల్లి మండల అధ్యక్షులు గాలి దిలీప్ కుమార్, చిత్తూరు జిల్లా అధికార ప్రతినిధి గంగారపు గోపి మరియు మండల నాయకులు, కార్యకర్తలు, ‌మహిళలు పెద్ద ఎత్తున పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *