బి.యన్.రెడ్డి నగర్. మన న్యూస్ :- బి.యన్.రెడ్డి డివిజన్ పరిధిలోని వైదేహినగర్ నార్త్ కాలనీలో, జిహెచ్ఎంసి కాంట్రాక్టర్ వైదేహి నగర్ నార్త్ కాలనీలోని సాయిబాబా గుడి రోడ్డులో, సిసి రోడ్డు నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన సోమవారం ఉదయం ప్రారంభించడం జరిగింది.సుదీర్ఘ నిరీక్షణ అనంతరం సాయిబాబా గుడి రోడ్డులో సిసి రోడ్డు నిర్మాణ పనులు జరుగుటలో సహాయ సహకారాలు అందించిన తెలంగాణ ప్రభుత్వం, మన నియోజకవర్గ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి, జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ కి, బి.యన్.రెడ్డి డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షులు కటిక రెడ్డి అరవింద్ రెడ్డి కి జిహెచ్ఎంసి కాంట్రాక్టర్ కి వైదేహి నగర్ నార్త్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున కాలనీవాసుల తరఫున, కాలనీ అధ్యక్షులు పోగుల రాంబాబు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది*ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు నాగరాజా రామనాథరెడ్డి రామ్మోహన్ ప్రభాకర్ కోటేశ్వరయ్య రాధాకృష్ణమూర్తి కాలనీవాసులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *