టీటీడీ ఈవో చేతుల మీదుగా ప్రతిష్టాత్మక పురస్కారం అందజేత…
అన్నస్వామిపల్లి గ్రామానికి దక్కిన అరుదైన గౌరవం..
సంతోషం వ్యక్తం చేసిన తండ్రి ముచ్చేలి భాస్కర్ రెడ్డి, గ్రామస్తులు…
రేణిగుంట ఆగష్టు 15.
రేణిగుంట మండలం అన్నస్వామిపల్లికి చెందిన ప్రముఖ సీనియర్ వైద్యులు డా. ముచ్చేలి మునిశంకర్ రెడ్డి ప్రతిష్టాత్మక బర్డ్ ఆసుపత్రిలో ఉత్తమ వైద్యుడు అవార్డును అందుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
సేవాభావంతో, నిబద్ధతతో పనిచేస్తూ వైద్య రంగంలో విశేష గుర్తింపు పొందిన డా. మునిశంకర్ రెడ్డి, రోగులకు అందిస్తున్న నాణ్యమైన సేవలు మరియు ఆయన అంకితభావానికి గుర్తింపుగా ఈ గౌరవం లభించింది.
తన కుమారుడు అందుకున్న ఈ అరుదైన గౌరవంపై ఆయన తండ్రి, అన్నస్వామిపల్లికి చెందిన ముచ్చేలి భాస్కర్ రెడ్డి ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. కుమారుడి నిరంతర కృషికి, సేవా నిరతికి ఇది తగిన ప్రతిఫలమని ఆయన పేర్కొన్నారు.
డా. ముచ్చేలి మునిశంకర్ రెడ్డికి ఉత్తమ వైద్యుడి అవార్డు లభించడం పట్ల రేణిగుంట మండల ప్రజలు తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. స్థానికులు, బంధుమిత్రులు మరియు ప్రజాప్రతినిధులు ఆయనకు వెల్లువలా అభినందనలు తెలియజేస్తున్నారు.

